For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సమీక్షించుకోకుంటే రెండో టెస్టులోనూ అదే ఫలితం!!

 India v West Indies, 1st Test, Stats review: From Indias biggest Test win to Prithvi Shaws record-breaking debut

న్యూ ఢిల్లీ: భారత్ పర్యటన చేపట్టిన విండీస్‌పై విజయాన్ని ఆశించకపోయినా.. గట్టిపోటీనైనా ఇవ్వాని ఆశపడి ఉంటారు. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైనప్పటికీ.. కరీబియన్‌ జట్టు పుంజుకోగలదు. గతేడాది ఇంగ్లండ్‌లో ఇదే పరిస్థితుల్లో వారు టెస్టు నెగ్గారు. ఆ మ్యాచ్‌లో షై హోప్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బ్రాత్‌వైట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల దూరంలో ఔటయ్యాడు.

 బంతి విపరీతంగా తిరిగితే మాత్రం:

బంతి విపరీతంగా తిరిగితే మాత్రం:

ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఇద్దరు రాణిస్తే రాజ్‌కోట్‌లో కంటే విండీస్‌ ఎక్కువ పరుగులు చేయగలదు. తొలి టెస్టులో భారత స్పిన్నర్లను ఎదుర్కొనడంలో సరైన దృక్పథం లేకపోవడమే పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌కు ప్రతిబంధకంగా మారింది. బంతి విపరీతంగా తిరిగితే వారి ప్రదర్శనను అర్ధం చేసుకోవచ్చు. కానీ, పరిస్థితి అలా లేదు.

 649 పరుగుల భారీ స్కోరు :

649 పరుగుల భారీ స్కోరు :

వ్యూహాత్మకంగా ఆడాల్సింది పోయి క్రీజులో నిలవలేం అన్నట్లు తొందరపడ్డారు. 649 పరుగుల భారీ స్కోరు దన్నుతో... భారత స్పిన్నర్లకు ఒకటీ రెండు ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చినా బాధపడాల్సిన అవసరం లేకపోయింది. వారు వరుసపెట్టి వికెట్లు తీయడం భారత కెప్టెన్‌ను సంతోషపర్చి ఉంటుంది. ఈ క్రమంలోనే కుల్దీప్‌ యాదవ్‌ టెస్టులో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

బౌన్సర్లు సంధించడంపై ఉత్సుకత చూపకపోగా

బౌన్సర్లు సంధించడంపై ఉత్సుకత చూపకపోగా

బౌన్సర్లు సంధించడంపై అంతగా ఉత్సుకత చూపకపోవడం కూడా మ్యాచ్‌లో విండీస్‌ పోటీ ఇవ్వకపోవడానికి మరో కారణం. విపరీతమైన వేడిని కారణంగా చెప్పుకొన్నా, ఒక వేగవంతమైన బౌలర్‌ తన ప్రధాన ఆయుధాన్ని ఉపయోగించుకోకుంటే పటిష్ఠ భారత బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేయడానికి మార్గం లేకుండాపోయింది. స్వింగ్, సీమ్‌ రెండూ లేని రాజ్‌కోట్‌ పిచ్‌పై బౌలర్లు బౌన్సర్లు వేసి ఉంటే విండీస్‌ తిరిగి పోటీలోకి రాగలిగేది.

శుక్రవారం రెండో టెస్టులో

శుక్రవారం రెండో టెస్టులో

వారు కనుక ఈ పరాజయంపై నిజాయతీగా సమీక్ష చేసుకుంటే రెండో టెస్టులో పోటీని ఇచ్చే ప్రదర్శన చేయగలరు. లేదంటే మరో పరాజయం తప్పకపోవచ్చు. ఈ తొలి టెస్టులో అనూహ్య రీతిలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పృథ్వీ షా.. తొంబై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా.. వెస్టిండీస్‌ను శుక్రవారం రెండో టెస్టులో ఢీకొట్టనుంది.

1
44265
Story first published: Monday, October 8, 2018, 11:29 [IST]
Other articles published on Oct 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+