For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ గెలిచింది.. ధోని రికార్డు వాయిదా పడింది

India v/s South Africa, 6th ODI: MS Dhoni eyes 3 more records at Centurion

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా కోహ్లీ సేన రెచ్చిపోయి సఫారీలను చిత్తు చేసింది. కోహ్లీ వన్ మాన్ షోగా పరుగుల వరద పారించి సఫారీ జట్టు లక్ష్యాన్ని అలవోకగా గెలిపించాడు. కానీ, ఇంకో 33పరుగులు సాధిస్తే ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల క్లబ్‌లో చేరతాడు. కానీ, కోహ్లీ ఆ అవకాశం ఇస్తే కదా.. సఫారీలను దుమ్ము దులిపేశాడు.

విదేశీ పర్యటనల గురించి పలువురు మాట్లాడిన ప్రతీ ప్రశ్నకు బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డేల్లో అరుదైన రికార్డుకు చేరువ దాకా వచ్చి ఆగిపోయాడు. సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో ఆఖరిదైన ఆరో వన్డేలో టీమిండియా తలపడి విజయం సాధించింది.

600 క్యాచ్‌లు:

అంతర్జాతీయ క్రికెట్‌లో 600 క్యాచ్‌లు పట్టిన మూడో వికెట్‌ కీపర్‌గా ధోని ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో చివరిదైన ఆరో వన్డేలో ఆమ్లా క్యాచ్‌ పట్టడం ద్వారా ధోని ఈ మార్కును చేరాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్‌ కీపింగ్‌ క్యాచ్‌ల్లో భాగస్వామ్యమైన తొలి భారత కీపర్‌గా ధోని నిలిచాడు. 494 మ్యాచ్‌ల్లో 564 ఇన్నింగ్స్‌ల్లో ఆరొందల కీపర్‌ క్యాచ్‌లను ధోని పట్టాడు.

ఓవరాల్‌గా వికెట్‌ కీపర్‌గా అత్యధిక వికెట్లు పట్టిన జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో మార్క్‌ బౌచర్‌(952-దక్షిణాఫ్రికా) ఉండగా, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(813-ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉన్నాడు. 494 మ్యాచ్‌ల్లో 564 ఇన్నింగ్స్‌ల్లో ధోని ఆరొందల క్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 256, వన్డేల్లో 297, టి20ల్లో 47 క్యాచ్‌లను ధోని పట్టాడు.

300 క్యాచ్‌లు:
మహేంద్ర సింగ్ ధోనీ తన సఫారీ పర్యటనల్లో ఇప్పటి వరకు 400 వికెట్‌లు తీసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అందులో వికెట్ కీపర్‌గా 297క్యాచ్‌లు, 107 స్టంపింగ్‌లు ఈ సిరీస్‌ను సైతం ముగించాడు. ఇంకో 3క్యాచ్ లు పడితే ధోనీ 300క్యాచ్‌ల క్లబ్ లోకి చేరిపోతాడు.

ఈ 10వేల మార్క్‌ను చేరుకుంటే మొత్తంగా 12వ బ్యాట్స్‌మన్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా మిస్టర్ కూల్ నిలవనున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌చిన్ టెండూల్కర్, గంగూలీ, రాహుల్ ద్రవిడ్ భార‌త్ త‌ర‌ఫున ఈ ఘ‌న‌త సాధించిన వారిలో ఉన్నారు.

ధోనీ ఈ మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 318 వన్డేలాడిన మహీ 272 ఇన్నింగ్స్‌ల్లో 9,967 పరుగులు చేశాడు. సఫారీలు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో అతని రికార్డుకు మళ్లీ వాయిదా పడింది.

Story first published: Saturday, February 17, 2018, 14:11 [IST]
Other articles published on Feb 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+