న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ లీడింగ్ వికెట్ టేకర్, ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ భారత్‌లో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. 34 ఏళ్ల ఆండర్సన్ తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడు. దీంతో అతడు భారత్‌తో జరిగే సిరిస్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
భారత్-ఇంగ్లాండ్ సిరిస్: తేదీలు, వేదికలు ఖరారు
త్వరలోనే అండర్సన్ భారత్ పర్యటనకు రానున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది. నేషనల్ క్రికెట్ పెర్ఫామెన్స్ సెంటర్‌లో అండర్సన్‌కు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసైనట్లు వేల్స్ అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్ పర్యటనలో భుజానికి గాయం అవడంతో టెస్టు సిరిస్‌కి దూరమైన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సైతం ఆండర్సన్ పయనంపై స్పష్టతనిచ్చాడు. గత కొన్ని రోజులుగా భుజం గాయంతో ఆండర్సన్ ప్రధాన టోర్నీలకు దూరంగా ఉన్నాడు. అయితే ఈనెల 9వ తేదీన రాజ్‌కోట్ లో ఆరంభమయ్యే తొలి టెస్టుకి అండర్సన్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
భారత్‌లో సిరీస్‌లో పాల్గొనేందుకు అండర్సన్‌కు ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అండర్సన్ జట్టుతో కలవడం ఇంగ్లాండ్‌కు కచ్చితంగా అదనపు బలం చేకూరుతుంది. భారత పర్యటనకు ఇంగ్లాండ్ టెస్టు జట్టు:
1. Alastair Cook (captain, Essex)
2. Moeen Ali (Worcestershire)
3. Zafar Ansari (Surrey)
4. Jonny Bairstow (Yorkshire)
5. Jake Ball (Nottinghamshire)
6. Gary Ballance (Yorkshire)
7. Gareth Batty (Surrey)
8. Stuart Broad (Nottinghamshire)
9. Jos Buttler (Lancashire)
10. Ben Duckett (Northamptonshire)
11. Steven Finn (Middlesex)
12. Haseeb Hameed (Lancashire)
13. Adil Rashid (Yorkshire)
14. Joe Root (Yorkshire)
15. Ben Stokes (Durham)
16. Chris Woakes (Warwickshire)
టెస్టు షెడ్యూల్
1st Test: 9-13 November at Saurashtra Cricket Association Stadium in Rajkot.
2nd Test: 17-21 November at Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam.
3rd Test: 26-30 November at Punjab Cricket Association IS Bindra Stadium, Mohali, Chandigarh.
4th Test: 8-12 December at Wankhede Stadium, Mumbai.
5th Test: 16-20 December at MA Chidambaram Stadium at Chepauk, Chennai
వన్డే షెడ్యూల్
1st ODI: 15 January at Maharashtra Cricket Association Stadium, Pune.
2nd ODI: 19 January at Barabati Stadium, Cuttack.
3rd ODI: 22 January at Eden Gardens, Kolkata.
టీ2 0షెడ్యూల్
1st T20I: 26 January at Green Park, Kanpur.
2nd T20I: 29 January at Vidarbha Cricket Association Stadium, Jamtha, Nagpur.
3rd T20I: 1 February at M Chinnaswamy Stadium, Bengaluru.
అన్ని మ్యాచ్‌లు కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రసారం అవుతాయి. టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. వన్డేలన్నీ కూడా డే/నైట్ జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటల తర్వాత జరుగుతాయి.