రాహుల్ ఫిట్: మ్యాచ్ ఆడకుండానే పాండ్యా అవుట్
మొహాలి: గాయాలు టీమిండియా ఆటగాళ్లను వేధిస్తున్నాయి. గాయాల కారణంగా ఒక్కొక్కరు జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా గాయం కారణంగా జట్టుకు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమయ్యాడు. ఇంగ్లాండ్ సిరిస్‌తో జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా మ్యాచ్ ఆడకుండానే గాయపడటం విశేషం.
మొహాలి టెస్టు ప్రారంభానికి ముందు, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా భుజానికి గాయమైంది. స్పెషలిస్టుచే వైద్య పరీక్షలు చేయించుకొని, మెరుగైన చికిత్సను పొందడానికి వీలుగా టెస్టు జట్టు నుంచి విడుదల చేశామని ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాడు.
పాండ్యా వైద్య పరీక్షల నివేదికలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని షిర్కే తెలిపాడు. మరోవైపు గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, డిసెంబర్ 8న ముంబైలో జరగనున్న నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నట్లు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది.

నాలుగో టెస్టుకు అందుబాటులో రాహుల్
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 8 నుంచి ముంబైలో జరగనున్న నాలుగో టెస్టుకు ఓపెనర్ లోకేష్ రాహుల్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. ఎడమ చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టులో ఆడడం లేదు. అయితే, వైద్య పరీక్షల అనంతరం అతను త్వరగానే కోలుకునే అవకాశాలున్నట్టు తెలిసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

రాహుల్‌కు తగిలిన గాయం తీవ్రమైంది కాదు
ముంబై టెస్టు ఆరంభమయ్యేలోగా అతను పూర్తి ఫిట్‌నెస్‌ను సంపాదించుకొని, తుది జట్టుకు ఎంపికయ్యేందుకు సిద్ధంగా ఉంటాడని అందులో తెలిపింది. రాహుల్‌కు తగిలిన గాయం తీవ్రమైనదేమీ కాదని స్పష్టం చేసింది. ఇలా ఉంటే రాహుల్ తరచు గాయాలబారిన పడడం అటు బోర్డు అధికారులను, ఇటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు
ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన సిరిస్ సందర్భంగా ఫిట్‌నెస్ సమస్య కారణంగా చివరి రెండు టెస్టులతోపాటు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌కు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు కేఎల్ రాహుల్ ఎంపికైనా తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు. అయితే రాజ్‌కోట్‌లో ముగిసిన తొలి టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే.

రెండో టెస్టులో విఫలం
ఇక తొలి టెస్టులో ఓపెనర్ గౌతం గంభీర్ విఫలం కావడంతో, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకు సెలక్టర్లు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైనా టీమిండియా 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో పది పరుగులకే వెనుదిరిగాడు. అంతేకాదు మూడో టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. సాహా స్ధానంలో మూడో టెస్టులో చోటు దక్కించుకున్న పార్ధీవ్ పటేల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications