దూసుకెళ్లాడు: బెంగళూరు వీధుల్లో ఆటో నడిపిన మైకేల్ క్లార్క్(వీడియో)
బెంగళూరు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం కామెంటేటర్ అయిన మైకేల్ క్లార్క్.. ఆటో నడపాలని ముచ్చటపడ్డాడు. అనుకున్నదే తడవుగా బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ వద్ద కొద్ది నిమిషాలు శిక్షణ పొంది ఆటోను నడిపాడు. దీనికి సంబంధించిన 22 సెకన్ల వీడియోను ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు క్లార్క్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసిపోవడంతో మిగితా పనులపై దృష్టి పెట్టాడు క్లార్క్. దీనిలో భాగంగాన ఆటోను నేర్చుకోవడం, నడపడం చేశాడు.
ఈ ఆటోలను క్లార్క్ టక్‌టక్ అనే పేరుతో సంబోధించాడు. 'నేను టక్‌టక్‌ను నడపటం నేర్చుకున్నాను.. నేను క్రికెట్ కెరీర్ ప్రారంభించింది ఇక్కడే.. మళ్లీ అదే బెంగళూరు వచ్చినందుకు ఆనందంగా ఉంది' అని పోస్టులో పేర్కొన్నాడు. క్లార్క్ తన తొలిటెస్ట్ మ్యాచ్‌ను బెంగళూరులోనే ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications