న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ ఐదు జోడీలివే!

India v Australia 2018: 5 Key battles which might decide the outcome of the Test series

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్మిత్, వార్నర్ లేకపోవడం... మునుపటి కంటే టీమిండియా బలంగా ఉండటంతో ఈ సిరిస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది.

గవర్నర్, కేటీఆర్, చిరంజీవిలను ఆహ్వానించిన సైనా, కశ్యప్‌లుగవర్నర్, కేటీఆర్, చిరంజీవిలను ఆహ్వానించిన సైనా, కశ్యప్‌లు

తరాలు, కెప్టెన్లు మారుతున్నా... బరిలోకి దిగిన ప్రతిసారి టీమిండియాకు నిరాశే ఎదురవుతోంది. అయితే, ఈసారి టీమిండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ లేని లోటుతో బ్యాటింగ్ పరంగా బలహీనంగా కనిపిస్తోంది. ఈ నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదు జోడీలు ప్రభావితం చేయబోతాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దామా!

విరాట్ కోహ్లీ vs మిచెల్ స్టార్క్

విరాట్ కోహ్లీ vs మిచెల్ స్టార్క్

ఈ సిరిస్‌లో అందరి కళ్లు వీరిద్దరిపైనే. ఇప్పటికే బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ అనేక రికార్డులన్ని బద్దలు కొడుతుంటే... ఆస్ట్రేలియా విజయాల్లో మిచెల్ స్టార్క్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా.. పరుగులు కొల్లగొట్టడంలో కోహ్లీ దిట్ట. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో సాధించిన పరుగులే దీనికి నిదర్శనం. ఇక, మిచెల్ స్టార్క్ విషయానికి వస్తే పదునైన పేస్‌కు తోడు స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించగలడు. కోహ్లీ, స్టార్క్ ముఖాముఖి తలపడితే ఆ మజానే వేరు. ఒకరిపై ఒకరికి మంచి గౌరవముంది. ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు తరఫున స్టార్క్ ప్రాతినిధ్యం వహించాడు.

ఛటేశ్వర్ పుజారా vs జోష్ హాజిల్‌వుడ్

ఛటేశ్వర్ పుజారా vs జోష్ హాజిల్‌వుడ్

భారత టెస్టు జట్టులో నిలకడకు పెట్టింది పేరు చతేశ్వర్ పుజారా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఉన్నానంటూ ముందుండి నడిపించడంలో పుజారా ఎల్లప్పుడూ ముందు ఉంటాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు పూర్తిగా అలిసిపోయేలా, క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో పుజారా తర్వాతే. ఇక, మెక్‌గ్రాత్ తర్వాత ఆసీస్ జట్టుకు దొరికిన తురుపుముక్క జోష్ హాజిల్‌వుడ్. అలసిపోకుండా ఓవర్లు వేయడంలో హాజిల్‌వుడ్ ఆరితేరాడు. వేగానికి స్వింగ్ జోడిస్తూ వికెట్లు తీయగలడు. దీంతో వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.

జస్ప్రీత్ బుమ్రా vs ఉస్మాన్ ఖవాజా

జస్ప్రీత్ బుమ్రా vs ఉస్మాన్ ఖవాజా

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా జస్‌ప్రీత్ బుమ్రాకు పేరు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా ఈమధ్య టెస్ట్‌ల్లోనూ రాణిస్తున్నాడు. తనదైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాట్స్‌మెన్ బోల్తా కొట్టించే ఈ యువ బౌలర్ ఇప్పటివరకు ఆడిన ఆరు టెస్ట్‌ల్లో 25.57 సగటుతో 28 వికెట్లు తీశాడు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ సిరిస్‌లో స్మిత్, వార్నర్ లేని లోటును ఉస్మాన్ ఖవాజా పూడ్చేలా కనిపిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు జట్టు అవసరాలకు అనుగుణంగా తన ఆటతీరును ఎప్పటికప్పుడు మార్చుకుంటాడు.

అజ్యింకే రహానే vs నాథన్ లయాన్

అజ్యింకే రహానే vs నాథన్ లయాన్

భారత మిడిలార్డర్‌లో రహానే పాత్ర కీలకం. అయితే గత కొంత కాలంగా రహానే బ్యాటింగ్‌లో తీవ్రంగా తడబడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇక, ఈ సిరిస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు నాథన్ లయాన్ బలం. పేస్ పిచ్‌లపైనా స్పిన్‌తో వికెట్లు నేలకూల్చడంలో లయాన్‌ అద్భుతమైన బౌలర్. టెస్ట్‌ల్లో మూడు, నాలుగో రోజు ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్ కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. ఈ నేపథ్యంలో లయాన్‌ను రహానే ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారింది ఉంది.

టిమ్ పైనీ vs రవిచంద్రన్ అశ్విన్

టిమ్ పైనీ vs రవిచంద్రన్ అశ్విన్

స్వదేశంతో తప్ప.. విదేశాల్లో రాణించలేడనే అపవాదు అశ్విన్‌కు ఉంది. ఈ అపవాదుని చెరిపివేసుకునేందుకు అశ్విన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు ఆరు టెస్ట్‌లాడిన రవిచంద్రన్ అశ్విన్ 54.71 సగటుతో 21 వికెట్లు తీశాడు. టిమ్ పైనీ విషయానికి వస్తే బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించి... తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు గెలుపు అందుకోని పైనీ సొంతగడ్డపై విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఊవిళ్లూరుతున్నాడు.

Story first published: Tuesday, December 4, 2018, 14:09 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X