For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రాక్టీస్ పిచ్‌పై కోహ్లీసేన అసంతృప్తి: సఫారీల లక్ష్యం ఇదే

By Nageshwara Rao
India unhappy over practice pitches at Wanderers

హైదారాబాద్: సఫారీ పర్యటన టీమిండియాకు అస్సలు కలిసొచ్చినట్లుగా లేదు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. జోహెన్స్‌బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 24న ప్రారంభం కానుంది.

జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో జొహనెస్‌బర్గ్‌లో ప్రాక్టీస్ కోసం కేటాయించిన పిచ్‌‌ నాణ్యతపై భారత బ్యాటింగ్ కోచ్, ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారత బౌలర్లు మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లతో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ వేయించాడు. అయితే భారత జట్టు మేనేజ్‌మెంట్ ఏదైతే పిచ్‌ కావాలని కోరిందో అది కాకపోవడంతో ఆటగాళ్లతో పాటు బంగర్ అసంతృప్తికి గురయ్యాడు.

దీంతో రవిశాస్త్రి జొహనెస్‌బర్గ్ క్యూరేటర్‌తో మాట్లాడి నాసిరకంగా ఉన్న ప్రాక్టీస్ పిచ్‌‌లపై రీ రోలింగ్ చేయించి అనంతరం టీమిండియా‌తో ప్రాక్టీస్ చేయించాడు. నిజానికి మూడో టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ స్టేడియంలో బౌన్సీ వికెట్‌ రూపొందిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ప్రాక్టీస్ కోసం అలాంటి పిచ్‌లే కావాలనే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుని కోరాడు.

కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టు ప్రారంభానికి ముందు కూడా టీమిండియా ఇలానే ప్రాక్టీస్ పిచ్‌లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సిరిస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్న దక్షిణాఫ్రికా మూడో టెస్టు జరిగే వాండరర్స్ స్టేడియంలో కూడా పచ్చిక వికెట్‌ను రూపొందిస్తోంది.

ఈ మేరకు వాండరర్స్ క్యూరేటర్ బ్రయాన్ బ్లోయేకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వాండరర్స్ వికెట్, మైదానం మొత్తం న్యూజిలాండ్ పిచ్‌లను తలపిస్తోంది. మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం ఉండటంతో అప్పటివరకు పిచ్‌పై కొద్దిగా పచ్చికను తొలగించే అవకాశాలున్నాయి.

మరోవైపు జొహన్నెస్‌బర్గ్‌లో వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పిచ్‌పై ఉన్న పచ్చిక ఎండిపోదని, ఇక్కడ నీటి సదుపాయం బాగానే ఉందని ప్రాక్టీస్ సెషన్ అనంతరం వాండరర్స్ పిచ్ క్యూరేటర్ బుట్యుయెల్ బుతెలెజి తెలిపాడు. పేస్, బౌన్స్ ఉంటుదని, స్పిన్‌కు ఏమాత్రం సహకరించదని చెప్పడం కొసమెరుపు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 17:54 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+