Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yash Dhull: కోహ్లీ అన్న మాకు మ‌స్తు ధైర్యాన్ని ఇచ్చిండు.. ఇక ప్ర‌పంచ‌క‌ప్ గెలుస్తం

India Under-19 captain Yash Dhull says Virat Kohli gave him courage before the final match

వెస్టిండీస్‌: నిత్యం టీమిండియా సీనియ‌ర్ జ‌ట్టును ఫాలో అవుతూ ఉండే క్రికెట్ అభిమానుల క‌న్ను ప్ర‌స్తుతం భార‌త జూనియ‌ర్ జ‌ట్టుపై ప‌డింది. ఆదివారం టీమిండియా ఆడ‌నున్న చారిత్రాత్మ‌క‌ 1000వ వ‌న్డే మ్యాచ్‌ను ప‌క్క‌నపెట్టి మ‌రి భార‌త అండ‌ర్ 19 జ‌ట్టును ఫాలో అవుతున్నారు. దీనికి ముఖ్య కార‌ణం నేడు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా స్టేడియం వేదిక‌గా భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ ఆడ‌బోతుండ‌డ‌మే. దీంతో స‌గ‌టు టీమిండియా క్రికెట్ అభిమాని ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌ను యువ భార‌త్ ఓడించాల‌ని కోరుకుంటున్నారు.

కోహ్లీ చిట్కాలు

కోహ్లీ చిట్కాలు

ఈ నేప‌థ్యంలో టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టుతో సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ముచ్చ‌టించాడు. వారికి త‌న అనుభ‌వాన్ని అంతా ఉప‌యోగించి ప‌లు విలువైన చిట్కాల‌ను చెప్పాడు. కాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు 2008లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది. ఆ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వంలోని భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు.. సౌతాఫ్రికా అండ‌ర్ 19 జ‌ట్టును ఓడించి ట్రోఫీ గెలుచుకుంది.

మా మ‌నోబ‌లం పెరిగింది

మా మ‌నోబ‌లం పెరిగింది

కోహ్లీ ఇచ్చిన సూచ‌న‌ల‌పై టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు కెప్టెన్ య‌ష్ ధూల్ స్పందించాడు. "విరాట్ కోహ్లీ మాకు ఫైనల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీతో మాట్లాడ‌డం వ‌ల్ల‌ మాలో ధైర్యం పెరిగింది. దీంతో మాకు ఫైన‌ల్ మ్యాచ్‌కు త‌గిన ఆత్మ‌విశ్వాసం ల‌భించింది. కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు మాతో మాట్లాడ‌డం వ‌ల్ల మా మనోబలం పెరిగింది. కోహ్లీ మా ప్రణాళికలను ఎలా అమలు చేయాలో చెప్పాడు.

ఇది కోహ్లీతో మాకు ఒక మంచి మీటింగ్‌" అని ధూల్ ప్రెస్ మీట్‌లో చెప్పాడు. అలాగే త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా విరాట్ కోహ్లీ స్పూర్తినిచ్చాడ‌ని తెలిపాడు. విరాట్ కోహ్లీ భార‌త జ‌ట్టులో ఫిట్‌నెస్ స్థాయిని, విభిన్న ప‌రిస్థితుల్లో పోటీప‌డే స్వ‌భావాన్ని మార్చాడ‌ని ధూల్ కొనియాడాడు.

ఉత్సాహంగా ఉన్నాం

ఉత్సాహంగా ఉన్నాం

ప్ర‌స్తుతం టీంలోని ప్ర‌తి ఒక్క‌రు ధైర్యంగా ఉన్నార‌ని య‌ష్ ధూల్ తెలిపాడు. ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పాడు. తాము సానుకూల దృక్ప‌థంతో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌బోతున్నామ‌ని ధూల్ తెలిపాడు. అలాగే త‌మ సొంత ప్ర‌ణాళిక‌ల‌ను గేమ్‌లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పాడు. తాము త‌మ ఫాంను కొన‌సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం త‌మ స్పిన్న‌ర్లు బాగా బౌలింగ్ చేస్తున్నార‌ని కెప్టెన్ య‌ష్ ధూల్ చెప్పాడు.

100% ఫ‌ర్‌ఫామెన్స్ ఇస్తాం

100% ఫ‌ర్‌ఫామెన్స్ ఇస్తాం

ఫైన‌ల్ మ్యాచ్‌లో 100% ఫ‌ర్‌ఫామెన్స్ ఇవ్వ‌డానికి జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క‌రు సిద్దంగా ఉన్నార‌ని ధూల్ చెప్పాడు. ఫైన‌ల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తాము అవ‌స‌ర‌మైన అనుభ‌వాన్ని సంపాదించామ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం త‌మ‌కు స‌మ‌యం విలువతోపాటు ఫైన‌ల్ వంటి పెద్ద మ్యాచ్‌ల‌కు ఎలా సిద్దం కావాలో తెలుస‌న్నాడు. గ‌తంతో పోలిస్తే త‌మ ఆట మెరుగుప‌డింద‌ని, ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో తాము నేర్చుకున్నామ‌ని ధూల్ తెలిపాడు.

Under 19 World Cup 2022 : గ్రూప్ మరియు వెన్యు వివరాలు | Teamindia || Oneindia Telugu
నేడే ఫైన‌ల్‌

నేడే ఫైన‌ల్‌

కాగా అండ‌ర్ 19 ప్రపంచ‌క‌ప్‌లో నేడు భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఆంటిగ్వా వేదిక‌గా సాయంత్రం 6:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Saturday, February 5, 2022, 12:37 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+