IPL 2022: సన్‌రైజర్స్‌లోకి ఇండియా అండర్ 19 కెప్టెన్ యష్ ధూల్! ధర ఎంతంటే..
సరిగ్గా మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలానికి బీసీసీఐ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఇక 10 ఫ్రాంచైజీలు కూడా మెగా వేలంలో అనుసరించాల్సిన తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. వేలంలో సరైన ఆటగాళ్లను కోనుగోలు చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఇటు తెలుగు వారి టీం అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వ్యూహాలలో అన్ని టీంలకంటే ఓ అడుగు ముందే ఉంది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని సైలెంట్‌గా ప్రణాళికలు రచిస్తోంది.

యష్ ధూల్‌పై కన్ను
మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మెనేజ్‌మెంట్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాపై సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. అండర్ 19 భారత జట్టు కెప్టెన్ యష్ ధూల్‌ను వేలంలో కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ నిర్ణయించిందని తెలిసింది. వేలంలో యష్ ధూల్‌కు ఎంత ధరైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉందని సమాచారం.

యష్ ధూల్ ఎందుకంటే..
ఇటీవల భారత అండర్ 19 జట్టు ప్రపంచకప్ గెలవడంలో యష్ ధూల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ముండు జరిగిన ఆసియా కప్ గెలవడంలోనూ యష్ ధూల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్‌గా ప్రస్తుతం యష్ ధూల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో, ప్రపంచకప్‌లో భారీగా పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో కరోనా బారిన పడినప్పటికీ కోలుకుని వచ్చి సత్తా చాటాడు. సెమీ ఫైనల్‌లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో యష్ ధూల్ బ్యాటింగ్‌పై అందరికీ మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే ధూల్ జట్టులో ఉంటే మంచి బ్యాటర్‌గా రాణిస్తాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నమ్ముతుందని సమాచారం. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలపడుతుందని భావిస్తోందట. ఎందుకంటే గత సీజన్లో సన్‌రైజర్స్ టీం బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైంది.

ముంబై, ఢిల్లీ నుంచి పోటీ
యష్ ధూల్ కోసం వేలంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి పోటీ తప్పేలా లేదు. ఆ జట్లు కూడా వేలంలో ధూల్‌ను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాయట. ఇందుకోసం సన్‌రైజర్స్‌తోపాటు ముంబై, ఢిల్లీ కూడా ధూల్‌కు భారీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మెగా వేలంలో యష్ ధూల్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

ధర ఎంతంటే?
ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలంలో యష్ ధూల్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. కానీ అతనికి ఉన్న డిమాండ్ దృష్యా వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ధూల్ ధర అమాంతం పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనా ప్రకారం వేలంలో ధూల్ 6 నుంచి 10 కోట్ల రూపాయల ధర పలుకుతాడని చెబుతున్నారు. ఇదే జరిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే యష్ ధూల్ కోటీశ్వరుడు అయిపోనున్నాడు. కాగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications