ట్రైనర్ మృతి: నలుపు రంగు ఆర్మ్ బ్యాండ్లు ధరించిన టీమిండియా
హైదరాబాద్: టీమిండియా అండర్ 19 క్రికెట్ జట్టుకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా సేవలందిస్తున్న రాజేష్ సావంత్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం (జనవరి 29)న ఉదయం ముంబైలోని ఓ హోటల్ గదిలో కొనుగొన్నారు. సోమవారం నుంచి ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుతో తలపడనున్న టీమిండియాను రాజేష్ సన్నద్ధం చేస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేయలేదు. దీంతో జట్టు సభ్యులు ఆయన కోసం చూస్తుండగా, హోటల్ రూంలో మృతి చెంది ఉన్నారన్న విషయం గుర్తించామని బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి వెల్లడించారు. రాజేష్ మృతికి గుండె పోటే కారణమని బీసీసీఐ వెల్లడించింది.

రిపోర్ట్ చేయని రాజేష్
ఈ ఘటనపై అమితాబ్ చౌదరి మాట్లాడుతూ 'ఆదివారం ఉదయం రేపటి మ్యాచ్ ప్రాక్టిస్ కోసం అందరం స్టేడియంలో రిపోర్ట్ చేశాం. కానీ రాజేష్ మాత్రం రిపోర్ట్ చేయలేదు. దీంతో ఆయన కోసం వెళ్లగా హోటల్ గదిలో చనిపోయి ఉన్నాడు' అని అమితాబ్ అన్నారు. దేశవాళీ క్రికెట్‌లో
సావంత్ అత్యుత్తమ ఫిట్‌నెస్ ట్రైనర్ ఒకడిగా పరిగణిస్తారని తెలిపాడు.
ఆఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్‌గా కూడా
రాజేష్ సావంత్ గతంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో, ఆఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్‌గా కూడా పని చేశారు. ఈ నెల మొదట్లోనే ఆయన రెండు వార్మప్ మ్యాచ్‌ల కోసం, ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా నియమితులయ్యారని అమితాబ్ తెలిపాడు.

మంచి స్నేహితుడిని కోల్పోయా: క్రికెటర్ పార్థివ్ పటేల్
రాజేష్ సావంత్ మృతిపట్ల క్రికెటర్ పార్థివ్ పటేల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. సావంత్ ఇక లేడన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాడు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ట్విట్టర్‌లో నివాళులర్పించాడు. భారత్, ఇంగ్లండ్ అండర్ 19 జట్ల మధ్య ముంబైలో సోమవారం జరగనున్న మ్యాచ్ కోసం ఆయన ముంబై వచ్చారు. నిద్రలోనే సావంత్ గుండెపోటుతో మరణించారని భావిస్తున్నారు.
నలుపు రంగు ఆర్మ్ బ్యాండ్లు ధరించిన భారత క్రికెటర్లు
ఆదివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత క్రికెటర్లు నలుపు రంగు ఆర్మ్ బ్యాండ్లు ధరించింది. భారత్ అండర్ 19 జట్టు ఫిట్‌నెస్ ట్రైనర్ రాజేష్ సావంత్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తండ్రి మృతికి సంతాప సూచకంగా భారత్ జట్టు సభ్యలు ఆర్మ్‌బ్యాండ్లు ధరించారు. షమీ తండ్రి తౌసిఫ్ అలీ రెండు రోజుల కిందట గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంతో టీ20 మ్యాచ్‌లకు షమీ దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications