IND vs ENG U-19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అద్భుతంగా రాణించిన యువ భారత క్రికెటర్లకు పెద్ద బహుమతి లభించింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. 5 వన్డే మ్యాచ్‌లు, 2 మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేందుకు సెలక్టర్లు 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ 16 మందిలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. ఈ అండర్-19 జట్టుకు సీఎస్కే జట్టు తరఫున అద్భుతంగా ఆడిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే జట్టుకు కెప్టెన్ కాగా.. జట్టులో వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. జూన్ 24 నుంచి జులై 23 వరకు సుదీర్ఘ కాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
ఆయుష్ మాత్రే కెప్టెన్ అయితే, అభిజ్ఞాన్ కుందు వైస్ కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటుదక్కింది. ఈ జట్టులో విహాన్ మల్హోత్రా, మౌల్యారాజ్ సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్‌వన్ష్ సింగ్(వికెట్ కీపర్) కూడా ఉన్నారు. వారితో పాటు ఆర్ఎస్ అంబరీష్, కనిష్మా చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్‌జీత్ సింగ్ కూడా ఉన్నారు. కొంత మంది ఆటగాళ్లను స్టాండ్‌బైలో ఉంచారు. ఈ క్రమంలో అందరి దృష్టి ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీల ఆటతీరుపైనే ఉండనుంది. ఐపీఎల్ లో అదరగొట్టిన ఈ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరగా మారింది. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు. ఆయుష్ మాత్రే సీఎస్కే తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగి 6 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టు
ఆయుష్ మాత్రే(కెప్టెన్)
వైభవ్ సూర్యవంశీ
విహాన్ మల్హోత్రా
మౌల్యరాజ్ సింగ్ చావ్డా
రాహుల్ కుమార్
అభిజ్ఞాన్ కుందు(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్)
హర్‌వన్ష్ సింగ్ (వికెట్ కీపర్)
ఆర్ఎస్ అంబరీష్
కనిష్క చౌహాన్
ఖిలాన్ పటేల్
హెనిల్ పటేల్
యుధజిత్ గుహా
ప్రణవ్ రాఘవేంద్ర
మహమ్మద్ ఇనాన్
ఆదిత్య రానా
అన్మోల్జిత్ సింగ్
ఇంగ్లాండ్ పర్యటన కోసం స్టాండ్‌బై ప్లేయర్లు వీరే..
నమన్ పుష్పక్
డి.దీపేష్
వేదాంత్ త్రివేది
వికల్ప్ తివారీ
అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్)
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ అండర్-19 షెడ్యూల్
జూన్ 24 -50 ఓవర్ల వార్మప్ మ్యాచ్-లోబోరో యూనివర్సిటీ
జూన్ 27 - తొలివన్డే -హోవ్
జూన్ 30 - రెండోవన్డే -నార్తాంప్టన్
జులై 2 - మూడో వన్డే -నార్తాంప్టన్
జులై 5 - నాలుగో వన్డే -వోర్సెస్టర్
జులై 7 - ఐదో వన్డే -వోర్సెస్టర్
జులై 12 -తొలి మల్టీడే మ్యాచ్- బెకింగ్‌హామ్
జులై 20- రెండో మల్టీడే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్