
హైదరాబాద్: అండర్-19 యూత్ టెస్టులో భారత యువ జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 47/3తో నాలుగో రోజు.. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 62.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. లంక జట్టులో పెర్నాండో (28) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. సిద్ధార్థ్ దేశాయ్ (4/40) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
యతిన్ మంగ్వాని(2/9), అయూష్ బదోని(2/17)లు చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక పరాజయం పాలైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613/8 వద్ద డిక్లేర్డ్ చేయగా... శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 316లకే పరిమితమై ఫాలోఆన్ ఆడిన సంగతి తెలిసిందే.
తాజా విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.