Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుమ్మేశారు: ఫార్మాట్ ఏదైనా ఇంగ్లాండ్‌కు భంగపాటు తప్పలేదు

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుపై మ్యాచ్ అంటే చాలు టీమిండియా ఆటగాళ్లు ఇరగదీస్తున్నారు. మొన్న కోహ్లీ సేన చేతిలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయిన ఇంగ్లాండ్.. తాజాగా స్వదేశంలో జరుగుతున్న అంధుల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను యువ భారత్ 3 1తో కైవసం చేసుకుంది. సోమవారం పూర్తి ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో భారత అండర్ 19 జట్టు 230 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా శుభ్‌మన్ గిల్, పృథ్వీషా సూపర్ సెంచరీలతో రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ జోడీ రెండో వికెట్‌కు 164 బంతుల్లో 231 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

గిల్ వరుసగా రెండో సెంచరీ

గిల్ వరుసగా రెండో సెంచరీ

ఈ సిరిస్‌లో తన అద్భుతమైన ఫామ్‌కు కొనసాగింపుగా గిల్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. చూడచక్కని షాట్లతో అలరించిన గిల్ 23 ఫోర్లు, ఓ భారీ సిక్స్‌ సాయంతో 115 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. మరోవైపు షా కూడా అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు.

ఇంగ్లాండ్‌ను ఘోరంగా దెబ్బతీసిన కమలేశ్ నాగర్‌కోటి

ఇంగ్లాండ్‌ను ఘోరంగా దెబ్బతీసిన కమలేశ్ నాగర్‌కోటి

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్థర్ గాడ్సల్, రావ్‌లీన్స్, బ్రూక్స్ తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను కమలేశ్ నాగర్‌కోటి ఘోరంగా దెబ్బతీశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో పరుగులు నిరోధించడంతో పాటు కీలక సమయంలో వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు.

37.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్

37.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్

దీంతో ఇంగ్లాండ్ 37.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో పోప్(59), జాక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో కమలేశ్‌ నాగర్‌కోటీ 4, వివేకానంద తివారీ 3, శివమ్‌ మావీ 2, ముగ్గురూ కలిసి తొమ్మిది వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో భారత్‌ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకొంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బుధవారం జరుగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+