Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనిపై వేటు: ఎమ్మెస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో అంటూ నెటిజన్ల ఫైర్

Dhoni's Fans Criticises The Selection Committee
India Treats True Leaders Shabbily: Fans Vent Out Their Anger On Twitter After MS Dhonis Exclusion From T20I Squad

హైదరాబాద్: వెస్టిండీస్‌తో నవంబర్ 4 నుంచి మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌కోసం ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 16 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 93 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు. అతడు 127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేశాడు. అలాంటి ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు.

ధోనిని తప్పించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు

"టీ20ల నుంచి ధోనిని తప్పించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని" ఓ నెటిజన్ హెచ్చరించాడు. "కెరీర్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడని ఎమ్మెస్కే.. ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మ" అని అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

అప్పుడు కెప్టెన్సీ తీసేశారనీ, ఇప్పుడు జట్టు నుంచి దూరం

"జట్టులో అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ అంటూ.. అప్పుడు కెప్టెన్సీ తీసేశారనీ, ఇప్పుడు జట్టు నుంచి దూరం చేయాలనుంకుంటున్నారు" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. టీ20ల్లో ధోని కెరీర్‌ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాత్రం వీటిని ఖండించారు.

ధోని కెరీర్‌ ముగిసిందని మాత్రం చెప్పలేను

"విండీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేము రెండో వికెట్‌ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్‌ పోటీ పడతారు. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు. అయితే టి20ల్లో ధోని కెరీర్‌ ముగిసిందని మాత్రం చెప్పలేను" అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు.

మూడో వన్డేలో ధోని అద్భుతమైన క్యాచ్‌

పుణె వేదికగా వెస్టిండిస్‌తో శనివారం ప్రారంభమైన మూడో వన్డేలో ధోని అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ (15: 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) వరుసగా 4, 6 బాది.. తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్‌ తాకిన బంతి ఫైన్‌లెగ్‌లో గాల్లోకి లేవగా.. మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వెళ్లిన వికెట్ కీపర్ ధోని డైవ్ కొట్టి మరీ క్యాచ్‌ని అందుకున్నాడు.

ఎమ్మెస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో నెటిజన్లు ట్వీట్

వాస్తవానికి ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖలీల్ అహ్మద్ ఆ క్యాచ్‌ని అందుకుంటాడని అంతా భావించారు. కానీ, అతను బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండటాన్ని గ్రహించిన ధోని పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై సైతం అతని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎమ్మెస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, October 27, 2018, 15:34 [IST]
Other articles published on Oct 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+