షెడ్యూల్ విడుదల: జనవరిలో కివీస్ పర్యటనకు కోహ్లీసేన

హైదరాబాద్: 2018-19 హోం సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్ మూడు ఆసియా దేశాలకు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు జరగనున్న వివిధ టోర్నీల్లో న్యూజిలాండ్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మరోవైపు అదే సమయంలో భారత మహిళల జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. భారత మహిళల జట్టు కూడా న్యూజిలాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
డిసెంబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు భారత పురుషుల, మహిళల జట్లతో సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటన షెడ్యూల్:
ఐదు వన్డేలు:
తొలి వన్డే - జనవరి 23
రెండో వన్డే - జనవరి 26
మూడో వన్డే - జనవరి 28
నాలుగో వన్డే - జనవరి 31
ఐదో వన్డే - ఫిబ్రవరి 03
మూడు టీ20లు:
తొలి టీ20 - ఫిబ్రవరి 06
రెండో టీ20 - ఫిబ్రవరి 19
మూడో టీ20 - ఫిబ్రవరి 10
మహిళల జట్టు పర్యటన వివరాలు:
మొదటి వన్డే - జనవరి 24
రెండో వన్డే - జనవరి 29
మూడో వన్డే - ఫిబ్రవరి 01
మూడు టీ20లు:
తొలి టీ20 - ఫిబ్రవరి 06
రెండో టీ20 - ఫిబ్రవరి 08
మూడో టీ20 - ఫిబ్రవరి 10
ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఒకే రోజు, ఒకే మైదానంలో జరగనుంది. ముందు భారత మహిళల జట్టు మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications