For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ పర్యటనలో కోహ్లీసేన: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ జరిగే సమయ వివరాలు

By Nageshwara Rao
India tour of South Africa 2018: Here's the full schedule of Test, ODI and T20I series

హైదరాబాద్: మంగళవారం (డిసెంబర్ 26)న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. 2018లో కోహ్లీసేన ఆడనున్న తొలి సిరిస్ దక్షిణాఫ్రికాలోనే జరగనుంది. సఫారీ పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభంకానుంది. టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతోంది. అంతేకాదు స్వదేశంలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని సఫారీ పర్యటనలో చరిత్ర సృష్టించేందుకు వెళ్తోంది.

ఈ నేపథ్యంలో సఫారీ పర్యటనలో కోహ్లీసేన ఎలా ఆడుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన ఎలాంటి వార్మప్ మ్యాచ్ లేకుండానే బరిలోకి దిగుతుండటం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీసేన వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్ విజయాలను గెలుచుకుంది.

తద్వారా ప్రపంచంలో వరుసగా అత్యధిక టెస్టు విజయాలను సాధించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రికార్డుని కోహ్లీసేన సమం చేసింది. సఫారీ గడ్డపై కోహ్లీసేన గనుక టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంటే అది ప్రపంచ రికార్డు అవుతుంది. ఈ రికార్డు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన షెడ్యూల్ ఇదే:


టెస్టులు:
1st Test: Jan 05-09 2018 @ Newlands, Cape Town
02:00 PM (IST)

2nd Test: Jan 13-17 2018 @ Supersport Park, Centurion
01:30 PM (IST)

3rd Test: Jan 24-28 2018 @ New Wanderers Stadium, Johannesburg
01:30 PM (IST)


వన్డేలు:

1st ODI: Feb 01, 2018, Thursday @ Kingsmead, Durban
05:00 PM (IST)

2nd ODI: Feb 04, 2018, Sunday @ Supersport Park, Centurion
01:30 PM (IST)

3rd ODI: Feb 07, 2018, Wednesday @ Newlands, Cape Town
05:00 PM (IST)

4th ODI: Feb 10, 2018, Saturday @ New Wanderers Stadium, Johannesburg
05:00 PM (IST)

5th ODI: Feb 13, 2018, Tuesday @ St George's Park, Port Elizabeth
05:00 PM (IST)

6th ODI: Feb 16, 2018, Friday @ Supersport Park, Centurion
05:00 PM (IST)


టీ20లు:
1st T20I: Feb 18, 2018, Sunday @ New Wanderers Stadium, Johannesburg
06:00 PM (IST)

2nd T20I: Feb 21, 2018, Wednesday @ Supersport Park, Centurion
09:30 PM (IST)

3rd T20I: Feb 24, 2018, Saturday @ Newlands, Cape Town
09:30 PM (IST)


తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 13:07 [IST]
Other articles published on Dec 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+