India Tour Of Zimbabwe : అందుకే నేను ఎంపిక కాలేదు.. క్లారిటీ ఇచ్చిన కేఎల్ రాహుల్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మేతో సహా.. జింబాబ్వే పర్యటన కోసం భారత వన్డే జట్టుకు మరో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సైతం ఎంపిక కాని విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి టీమిండియా తరపున రాహుల్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించడానికి బీసీసీఐ 15మంది ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేయగా అందులో కేఎల్ రాహుల్ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగింది. ఇప్పటికే కేఎల్ రాహుల్ చాలా పర్యటనలకు మిస్సయ్యాడు. మళ్లీ జింబాబ్వే పర్యటనకు కూడా అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే ప్రశ్నలు నెట్టింట వెల్లువెత్తాయి. కొందరైతే అతను తన ప్రేయసి అయిన అతియా శెట్టిని పెళ్లి చేసుకోనున్నాడని అందుకే జింబాబ్వే పర్యటన నుంచి తప్పుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు గజ్జ గాయం నుండి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెబుతున్నారు. ఈ విషయమై కేఎల్ రాహులే స్పష్టతనిచ్చాడు.
నా గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా
ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో తాను ఎందుకు జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదో వివరణ ఇచ్చాడు.. 'హే గాయ్స్ నా ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి నేను కొన్ని విషయాలపై ఓ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. జూన్‌లో నాకు జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. వెస్టిండీస్ పర్యటన కోసం జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశతో నేను నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా ప్రారంభించాను. దురదృష్టవశాత్తు నేను పూర్తి ఫిట్‌నెస్ దశకు చేరుకునే టైంలో నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.

మళ్లీ మొదటికొచ్చాను
'ఫలితంగా మళ్లీ నేను ఎప్పటిలాగే మొదటికెళ్లిపోయాను. నా ఫిట్ నెస్ శిక్షణ ఆగిపోయింది. ఐసోలేషన్ కోసం కొన్నాళ్లు వెచ్చించాలి. పైగా కొన్ని వారాల పాటు మళ్లీ ఫిట్ నెస్ శిక్షణ తీసుకోవాలి. అందువల్ల నేను ఎంపిక కాలేదు. ఏదేమైన నేను వీలైనంత త్వరగా కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందువల్ల తొందరగా సెలెక్షన్ కోసం అందుబాటులోకి రావాలని కూడా అనుకుంటున్నాను. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే అన్నింటికన్నా గొప్ప గౌరవం. మళ్లీ బ్లూ జెర్సీ ధరించడానికి అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. త్వరలో కలుద్దాం' అని రాహుల్ చెప్పాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైనా..?
జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు అతని గజ్జలో గాయం తీవ్రత అధికమైంది. అందువల్ల శస్త్రచికిత్స కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ చికిత్స విజయవంతమయ్యాక ఇండియాకు తిరిగొచ్చాడు. తర్వాత రాహుల్ NCAలో తిరిగి శిక్షణ పొందాడు. తర్వాత అతను వెస్టిండీస్ పర్యటన కోసం టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే రాహుల్‌కు ఈసారి కోవిడ్ సోకిందని తేలడంతో అతను ఈ సిరీస్‌కు కూడా మిస్సయ్యాడు. అతని స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును సిద్ధం చేయడానికి టీం మేనేజ్ మెంట్ చర్యలు తీసుకుంటుంది. రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి అలాగే టీమిండియాకు సెలెక్ట్ కావడానికి ఇక పూర్తి ఫిట్ నెస్‌తో, శిక్షణతో సిద్ధంగా ఉండాల్సిన అవసరముంది.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications