India Tour Of Zimbabwe : ఇండియావాళ్లు ఇప్పుడే వచ్చారహో.. జింబాబ్వే బోర్డు సంతోషం

జింబాబ్వేతో ఆగస్టు 18న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్లు, సహాయక సిబ్బంది శనివారం జింబాబ్వేకు చేరుకున్నారు. వారు హరారేలో దిగారు. భారత్ వర్సెస్ ఆతిథ్య జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జరగనున్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే పర్యటనకు భారత తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఎందుకంటే యూఏఈలో ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022కు ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు సెలెక్షన్ కమిటీ విరామమిచ్చింది. ఇక కేఎల్ రాహుల్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకుని తిరిగి జాతీయ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. అతను జింబాబ్వే పర్యటనలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

తొలుత ధావన్ కెప్టెన్ అయినా.. ?
‘ఇండియా ప్లేయర్లు ఇప్పుడే వచ్చారు.' అంటూ జింబాబ్వే క్రికెట్ క్యాప్షన్ ఇచ్చింది. జింబాబ్వేకు ఆరేళ్ల తర్వాత భారత్ వెళ్తోంది. ఇండియా లాంటి జట్టు జింబాబ్వేకు రావడంతో ఆ దేశ బోర్డు చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ పర్యటనకు తొలుత ధావన్ కెప్టెన్‌గా ఎంపికయిన సంగతి తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ పాసవ్వడంతో హుటాహుటిన ధావన్‌ను తప్పించి కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక ధావన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ధావన్ కెప్టెన్సీలో గత నెలలో వెస్టిండీస్‌పై 3-0తో వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఇక జింబాబ్వే పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే భవిష్యత్తు కోసం ధావన్ స్థానంలో రాహుల్ అందుబాటులోకి రావడంతో అతన్నే కెప్టెన్ చేసింది.

ఈసారైనా రాహుల్ త్రిపాఠికి అవకాశం లభిస్తుందో లేదో
ఇకపోతే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్ తదితరులు తమ గాయాల నుంచి కోలుకుని తిరిగి భారత వన్డే జట్టులోకి వచ్చారు. రాహుల్ త్రిపాఠి సైతం జట్టులో చేరాడు. ఇక వీరిలో రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జింబాబ్వే పర్యటనలోనైనా అతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఇక కేఎల్ రాహుల్ చివరిసారిగా ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్లో అతను కెప్టెన్సీ వహించగా..సిరీస్ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.


ఇరు జట్లు ఇవే
భారత్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షరు పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
జింబాబ్వే : రెగిస్ చకబ్వా (కెప్టెన్), తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, రిచర్డ్‌టోర్ న్గార్వా , మిల్టన్ శుంబా, డోనాల్డ్ తిరిపానో, సికిందర్ రాజా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications