
వెస్టిండీస్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కాలని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. గైక్వాడ్‌ను వన్డేల్లో అరంగేట్రం చేయించాలని అలాగే కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి అతన్ని ఓపెనర్‌గా పక్కాగా బరిలోకి దించాలని వసీం జాఫర్ పేర్కొన్నాడు. రుతురాజ్ లిస్ట్ A క్రికెట్లో వన్డే ఫార్మాట్లో సాధించిన పరుగులే అతన్ని ఓపెనర్‌గా బరిలోకి దించడానికి అర్హుడని చెబుతున్నాయని జాఫర్ పేర్కొన్నాడు. గైక్వాడ్ 64 లిస్ట్ A మ్యాచ్‌లలో 54.73సగటుతో 100.09 స్ట్రైక్ రేట్‌తో 3284పరుగులు చేశాడు.
తద్వారా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021లో గైక్వాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు సాధించాడు. అతను 150.75సగటుతో ఐదు ఇన్నింగ్స్‌లలో 603పరుగులు సాధించి సీజన్లో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు.

'రుతురాజ్ వన్డేల్లో అరంగేట్రం చేయాలని, అలాగే వెస్టిండీస్ సిరీస్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని నేను భావిస్తున్నాను. రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో 5 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు బాదాడు. అందువల్ల అతను వన్డేల్లో బరిలోకి దిగడానికి అర్హుడని అర్థమవుతుంది. ఓపెనర్లుగా శిఖర్, రుతురాజ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ల కాంబో బాగుంటుంది.' అని జాఫర్ ట్వీట్ చేశాడు
ఇరు జట్ల స్క్వాడ్‌లు
వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్తీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మాన్ పావెల్, జేడెన్ సీల్స్
ఇండియా జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్