
వారిద్దరూ జట్టుకు దూరం, హోల్డర్ చేరిక
ఇక వెస్టిండీస్ జట్టులో మార్పుల విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌తో ఇటీవల ఆడిన వన్డే జట్టులో ఉన్న అండర్సన్ ఫిలిప్, రొమారియో షెపర్డ్.. ఇండియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇక షెపర్డ్ జట్టులో లేనప్పటికీ.. అతను రిజర్వ్ ఆటగాడిగా ఉంటాడు. అతనితో పాటు స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్ కూడా రిజర్వ్ ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇకపోతే క్రికెట్ వెస్టిండీస్ లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్.. హోల్డర్ తిరిగి జట్టులోకి వచ్చాక తమ జట్టు బాగా రాణిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 'జాసన్ హోల్డర్ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆల్‌రౌండ్ క్రికెటర్లలో ఒకడనే విషయం మనందరికీ తెలుసే. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నందుకు మేం సంతోషిస్తున్నాము. అతను పూర్తిగా రిఫ్రెష్ అయ్యాడని భావిస్తున్నాం. అలాగే తన సత్తువ చూపించడానికి ఈ సిరీస్ కోసం అతను సిద్ధంగా ఉన్నాడని అనుకుంటున్నాం. గ్రౌండ్ లోపల.. బయట అతని నుంచి జట్టుకు అవసరమైనంత సహాయ సహకారాలు అందాలని ఆశిస్తున్నాం' అని డెస్మండ్ హేన్స్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. "మేము గయానా వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లను కోల్పోయాం. కాబట్టి మేము ట్రినిడాడ్‌లో టీమిండియాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లలో పుంజుకోవాలని చూస్తున్నాము. మేము కొందరు ఆటగాళ్లలో కొంత ప్రగతి చూశాం. అయితే మేం మొత్తం జట్టుగా సమూహపరచుకొని టీమిండియాతో మెరుగ్గా ఆడాలి' అని డెస్మండ్ హేన్స్ చెప్పాడు.

వెస్టిండీస్, టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్
జులై 22: మొదటి వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
జూలై 24: రెండో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
జూలై 27: మూడో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. 9:30amకు వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇండియా కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు ప్రారంభమవుతాయి. ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి.

ఇరు జట్ల స్క్వాడ్‌లు
వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్తీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మాన్ పావెల్, జేడెన్ సీల్స్
ఇండియా జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్


Click it and Unblock the Notifications
