
ఆగస్టు 3 నుంచి విండిస్ పర్యటన
దీంతో ఇప్పటికీ టెస్టుల్లో భారత జట్టులో రోహిత్ శర్మ స్థానం పదిలం కాలేదు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ పర్యటన ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది.

టెస్టు జట్టులో ఉంటాడో లేదో
ఈ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ టెస్టు తుది జట్టులో ఉంటాడో లేదో కూడా క్లారిటీ లేదు. టెక్నీక్ విషయంలో ది బెస్ట్ అని పేరున్నప్పటికీ రోహిత్ శర్మ గత దశాబ్ద కాలంగా టెస్టుల్లో తడబడుతూనే ఉన్నాడు. టీమిండియా తరుపున ఇప్పటివరకూ కేవలం 47 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 39 యావరేజితో 1585 పరుగులు చేశాడు.

కేవలం 3 సెంచరీలు మాత్రమే
ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ మూడు కూడా సొంతగడ్డపై సాధించినవి కావడం విశేషం. అయితే, టెస్టుల్లో రోహిత్ శర్మకు పేలవ రికార్డు ఉన్నప్పటికీ వెస్టిండిస్ పర్యటనలో చోటు దక్కించుకోవడానికి మాత్రం కారణం ఉంది. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా సిరీస్ నుంచి నిన్నటి ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

టెస్టు కెరీర్‌ను గాడిలో పెట్టుకుంటాడో లేదో
ఈ నేపథ్యంలో సెలక్టర్లు రోహిత్ శర్మను టెస్టులకు ఎంపిక చేశారు. రోహిత్ శర్మకు కుమార్తె పుట్టిన తర్వాత ఆడే విధానంలో కూడా తేడా వచ్చింది. తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించి ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెడుతున్నాడు. విండిస్ పర్యటనతోనైనా తన టెస్టు కెరీర్‌ను గాడిలో పెట్టుకుంటాడో చూడాలి మరి.


Click it and Unblock the Notifications
