Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇతనే నా పార్ట్‌నర్‌.. వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధం

India vs West Indies 2019 : Shikhar Dhawan United With Opening Partner Rohit Sharma At Airport
India tour of West Indies 2019: Openar Shikhar Dhawan posts picture with partner Rohit Sharma from airport

ముంబై: నా పార్ట్‌నర్‌తో వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధం సిద్ధం అని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్‌ ధావన్‌ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ సెలెక్టర్లు ధావన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేశారు. టెస్టు ఫార్మాట్‌కు మాత్రం ఎంపిక చేయలేదు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

వెస్టిండీస్ పర్యటన కోసం భారత ఆటగాళ్లు సోమవారం రాత్రి ముంబై నుండి అమెరికాకు వెళ్లారు. పర్యటనకు వెళ్లేముందు ఓ హోటల్లో సహచర ఆటగాళ్లతో కలిసి ధావన్‌ సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి దిగిన ఫొటోను ధావన్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసాడు. 'నా పార్ట్‌నర్‌తో వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధం' అంటూ రాసుకొచ్చాడు. రోహిత్, ధావన్ పక్కపక్కనే కూర్చొన్న ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా జట్టు సభ్యులతో కలిసి దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పోస్టు చేశాడు. 'మియామి బౌండ్‌' అని కాప్షన్ పెట్టాడు. 'మియామి' అనేది దక్షిణ ఫ్లోరిడాలోని ఓ నగరం. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించనుంది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌ భాద్యతలు నిర్వర్తించనున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

Story first published: Tuesday, July 30, 2019, 16:34 [IST]
Other articles published on Jul 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+