For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా: విమానం ఎక్కేది డౌటే: రీషెడ్యూలా?

India tour of South Africa: might be pushed back by one week due to Covid19 Omicron variant

ముంబై: భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం న్యూజిలాండ్‌ సిరీస్‌తో బిజీగా ఉంటోంది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్‌ను విజయవంతంగా ముగించుకుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ఆరంభం కానుంది. దీని తరువాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన రెండో టెస్ట్ మ్యాచ్ ముగియనుంది. ఆ మరుసటి రోజే- టీమిండియా దక్షిణాఫ్రికా విమానం ఎక్కాల్సి ఉంది. ఇదీ షెడ్యూల్.

వారం రోజులు వెనక్కి..

వారం రోజులు వెనక్కి..

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రూపొందించిన ఈ దక్షిణాఫ్రికా షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. బీసీసీఐ ఈ షెడ్యూల్‌ను ఓ వారం రోజుల పాటు వెనక్కి జరుపనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే దక్షిణాఫ్రికా వెళ్తుంది టీమిండియా. దీనికి కారణం- ఒమిక్రాన్ వేరియంట్. ప్రాణాంతక కరోనా వైరస్ కొత్త స్వరూపం ఇది. దక్షిణాఫ్రికా, బోట్సువానాల్లో తొలిసారిగా ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా సహా 20 దేశాలకు వ్యాప్తి చెందింది.

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ భయం..

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ భయం..

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనేక దేశాలు దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికన్ కంట్రీస్‌లతో తమ వాయు సంబంధాలను తెంచుకున్నాయి. వాయు మార్గాలను మూసివేశాయి. విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తగ్గేంత వరకూ విమాన సర్వీసులను నడిపించే సాహసం చేయబోవట్లేదనేది స్పష్టమౌతోంది. భారత్ సైతం అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపిస్తామని జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది.

షెడ్యూల్‌లోగా..

షెడ్యూల్‌లోగా..

ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి అనుగుణంగా- బీసీసీఐ తన తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. భారత క్రికెట్ జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటనను వారం రోజుల పాటు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. మూడు టెస్టులు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్, నాలుగు టీ20 ఇంటర్నేషనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది భారత జట్టు. చివరి టీ20 మ్యాచ్ జనవరి 26వ తేదీన ఉంటుంది. అక్కడితో ఈ పర్యటన ముగిసిపోతుంది.

17న తొలి టెస్ట్ అనుమానమే..

17న తొలి టెస్ట్ అనుమానమే..

భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన మొదలవుతుంది. 21వ తేదీన ముగుస్తుంది. ఇప్పుడు అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో ఈ మ్యాచ్ షెడ్యూల్ సమయానికి ఆరంభమౌతుందా? లేదా? అనేది అనుమానమే. దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లడమే వారం రోజుల పాటు జాప్యం చోటు చేసుకుంటే- ఈ మ్యాచ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం మొదలు కాకపోవచ్చు. ఫలితంగా ఒక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకోవడమో లేక.. దాన్ని రీ షెడ్యూల్ చేసుకోవడమో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ సిరీస్..

ఇదీ సిరీస్..

రెండో టెస్ట్ మ్యాచ్ అదే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. చివరిదైన మూడో టెస్ట్ మ్యాచ్ జనవరి 3వ తేదీ ఆరంభమౌతుంది..7న ముగిసిపోతుంది. టెస్ట్ సిరీస్ తరువాత.. మూడు మ్యాచ్‌ల వన్డేలు, నాలుగు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. జనవరి 26వ తేదీన చివరి టీ20ని షెడ్యూల్ చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. ఆ తరువాత శ్రీలంక షెడ్యూల్‌ను రూపొందించింది బీసీసీఐ.

Story first published: Thursday, December 2, 2021, 14:05 [IST]
Other articles published on Dec 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+