'విరామ సమయంను విశ్రాంతికే పరిమితం చేయలేదు.. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా'

ఢిల్లీ: వెస్టిండీస్ పర్యటన నుంచి విశ్రాంతి లభించడంతో.. విశ్రాంతికే పరిమితం కాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా అని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యానని పేర్కొన్నాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడడంతో బీసీసీఐ సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.

విశ్రాంతికే పరిమితం చేయలేదు:
తాజాగా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... 'ఐపీఎల్, ప్రపంచకప్ లాంటి సుదీర్ఘ టోర్నీలు ఆడాను. దీంతో నాకు విశ్రాంతి అవసరం అనిపించింది. విరామ సమయంను కేవలం విశ్రాంతికే పరిమితం చేయలేదు. చికిత్స కంటే నివారణ అవసరం అంటారు. గాయాలను తట్టుకునేందుకు, నివారించేందుకు నా శరీరాన్ని సిద్ధం చేసుకున్నా' అని పాండ్యా తెలిపాడు.

ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా:
'ఈ విశ్రాంతి సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా. నా ఫిట్‌నెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు విశ్రాంతి చాలా ఉపయోగపడింది. గత నెల మొత్తం రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేశా. జట్టులోకి మరింత మెరుగ్గా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించా. నేను లక్ష్యాలు ఎక్కువగా పెట్టుకోను. సన్నాహకాలపై దృష్టిసారిస్తా. దక్షిణాఫ్రికా సిరీస్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్నా' అని పాండ్యా చెప్పాడు.

పాండ్యా తలకు తగిలేలా:
దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్ కోసం పాండ్యా సోదరులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న తొలి టీ20లో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరిస్ కోసం పాండ్యా సోదరులు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కఠినంగా శ్రమించారు. సోదరుడు కృనాల్ పాండ్యా బంతులు విసరగా.. హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో ఓ బంతిని దాదాపుగా కృనాల్ పాండ్యా తలకు తగిలేలా హార్దిక్ పాండ్యా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్ పాండ్యా ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ప్రాక్టీస్‌లో పాండ్యా:
"ప్రాక్టీస్‌లో పాండ్యా వర్సెస్ పాండ్యా. నేను ఈ రౌండ్ గెలిచాననే అనుకుంటున్నాను పెద్దన్నా. దాదాపు నీ తలకు తగిలేలా బంతి ఆడినందుకు సారీ"అంటూ హార్దిక్ పాండ్యా ఓ వీడియో పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications