WTC Final: బ్యాట్స్‌మన్ శతకాలు కొట్టేలా.. రవిశాస్త్రి ప్రణాళికలు! వినూత్న 3 పద్ధతులు ఇవే?

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2014 ఇంగ్లండ్ టూర్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. 2018లో మాత్రం పోటీ ఇచ్చింది. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత పేసర్లు సత్తాచాటినా.. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. అయితే గత మూడేళ్లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఎంతో మెరుగైన కోహ్లీసేన.. ఈసారి ఇంగ్లండ్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నది. ఇక ఇంగ్లీష్ గడ్డపై భారత్ అదరగొట్టేలా.. కోచ్ రవిశాస్త్రి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాట్స్‌మెన్ భారీ శతకాలు చేసేలా శిక్షణా పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని తెలిసింది.

రవిశాస్త్రి ప్రణాళికలు:
అన్ని దేశాలతో పోలిస్తే ఇంగ్లండ్‌లో ఆడటం కాస్త భిన్నంగా ఉంటుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు ముందుగానే అలవాటు పడాలి. లేదంటే బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టాల్సి ఉంటుంది. అక్కడి పిచ్‌లపై చక్కని పచ్చిక ఉంటుంది. బంతులు వేగంగా స్వింగ్ అవుతాయి. ఇంగ్లిష్ పేసర్లు సైతం సొంతగడ్డపై చెలరేగుతారు. పేస్, స్వింగ్‌లతో కూడిన అక్కడి పిచ్‌లపై మనోళ్లు బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఎంతో అనుభవం ఉంటే తప్ప క్రీజులో నిలబడలేరు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన భారీస్కోర్లు సాధించేందుకు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రణాళికలు రచిస్తున్నాడు.

పిచ్ పొడవును తగ్గించడం:
ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ శతకాలు చేయడం అత్యంత కీలకం. ప్రతి మ్యాచులో కనీసం ఇద్దరు ఆటగాళ్లు మూడంకెల స్కోరును అందుకొంటే భారత్ సునాయాసంగా విజయం సాదించగలదు. ఇందుకోసం రవిశాస్త్రి మూడు ప్రణాళికలు సిద్ధం చేశారట. నెట్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ పొడవును 22 నుంచి 16 గజాలకు తగ్గించడం మొదటిది. పిచ్ పొడవును తగ్గించడంతో వేగంగా వస్తున్న బంతులను ముందుగానే ఆడాల్సి ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎలాంటి షాట్ ఆడాలో వేగంగా నిర్ణయం తీసుకొనేందుకు అది ఉపయోగపడుతుంది.

నునుపు తేలిన బంతులతో ఆడడం:
ఒకవైపు నునుపు తేలిన బంతులతో ముందుగానే సాధన చేయించడం రెండోది. దీంతో నునుపు బంతులు ఎలా పిచవుతున్నాయో ముందే గుర్తించవచ్చు. నునుపు తేలిన బంతులు ముందుగా ఆడటం వల్ల పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. బంతిని ఆడాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండకుండా వదిలేసేలా శిక్షణ ఇవ్వడం మూడోది. ఇంగ్లండ్‌లో స్వింగ్ అయ్యే బంతులను వదిలేయడం చాలా అవసరం. ఈ కళ నేర్చుకొంటే.. తికమక పడకుండా స్థిరంగా బంతులు వదిలేయవచ్చు. ఈ మూడు పద్ధతులకు కోహ్లీసేన అలవాటు పడితే.. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

వాళ్లు కూడా చెలరేగితే:
పిచ్ ఏదైనా.. వికెట్ ఎలాంటిదైనా.. బంతి ఎలా స్పందిస్తున్నా.. భారత బ్యాటింగ్ భారం మోయాల్సింది టాపార్డరే. రోహిత్, పుజారా, పంత్ ఇటీవలి కాలంలో దుమ్మురేపుతున్నారు. వారికి అండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లీ.. 2018లో 5 టెస్టుల్లో 59.30 సగటుతో 593 పరుగులు చేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ చెలరేగితే ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ నెగ్గడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications