
ఇంగ్లాడ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోని(2014), మహ్మద్ అజారుద్దీన్ (1990) ఈ ఘనత సాధించారు. ఇటీవలే జరిగిన ఇంగ్లాడ్ సిరీస్ లో రోహిత్ నాయకత్వంలోని భారతజట్టు టీ20, వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
అటు హర్థిక్ పాండ్యా ఒకే మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో పాటు నాలుగు వికెట్ల తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.అతనికంటే ముందు
సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, శ్రీకాంత్ ఆజాబితాలో ఉన్నారు. అంతేకాక భారత ఉపఖండం వెలుపల ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా పాండ్యా నిలిచాడు.
జూలై 17న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆమ్యాచ్ లో పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు పడగొట్టడమే కాక.. చేజింగ్ లో రిషబ్ పంత్‌తో కలిసి ఐదో వికెట్‌కు 133 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి పాండ్యా 71 పరుగుల చేసి పెవిలియన్ కి చేరగా.. పంత్ 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక పంత్ సైతం ఉపఖండం వెలుపల సెంచరీ చేసిన నాలుగో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, కేఎల్ రాహుల్ ఈఘనత సాధించారు.
వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వారు భారత జట్టుతో చేరనున్నారు. రోహిత్ గైర్హాజరీలో, శిఖర్ ధావన్ వన్డేలలో భారత్‌కు నాయకత్వం వహిస్తాడు. రోహిత్ తిరిగి T20లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.