
ఆశలు వారిపైనే..
కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. అయిదో టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది చివరిది. ఇందులో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆశలన్నీ క్రీజ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో-బెన్ స్టోక్స్ మీదే ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌన్స్ బ్యాక్ కావాలంటే.. వీరిద్దరూ భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది.

7 నుంచి
ఈ మ్యాచ్ అనంతరం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ ఈ నెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

కోవిడ్ నెగెటివ్..
కాగా ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో ఆడనున్నాడు. కరోనా వైరస్ బారిన పడిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే అతను టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతనికి బదులుగా జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన మూడు కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.

అశ్విన్ తరువాత..
ఇంకోసారి అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని అనంతరం పేర్కొంది. ఇదివరకు వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కోవిడ్‌కు గురైన విషయం తెలిసిందే. అందుకే అతను ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. జట్టు మొత్తం ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లినప్పటికీ.. అశ్విన్ మాత్రం క్వారంటైన్‌లో గడిపాడు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాతే లండన్ విమానం ఎక్కాడు. ప్రస్తుతం అతను జట్టుతో ఉంటోన్నాడు.

ఇదీ జట్టు..
కాగా- తొలి టీ20 మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది కూడా. దీనికి రోహిత్ శర్మ కేప్టెన్. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సెలెక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications












