Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌లో కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన: షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: 2018 జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. సుమారు రెండున్న‌ర నెల‌ల పాటు జరిగే ఈ పర్యటన కోసం బ్రిటన్‌లో టీమిండియా సుదీర్ఘ కాలం బస చేయనుంది.

2018, జులై 3న ప్రారంభమయ్యే ఈ పర్యటన సెప్టెంబర్‌ 11న ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 3న ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో జ‌రిగే తొలి టీ20తో ఈ పర్యనట మొద‌లవుతుంది. ఆ తర్వాత జులై 5న కార్డిఫ్‌లో రెండో టీ20, 8న బ్రిస్ట‌ల్‌లో మూడో టీ20 ఆడనుంది.

India to tour England

ఆ త‌ర్వాత జులై 12న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇరు జట్ల మధ్య తొలి వ‌న్డే జ‌రుగుతుంది. జులై 14న లార్డ్స్‌లో రెండో వ‌న్డే, 17న హెడింగ్లేలో మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఇక ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఆగ‌స్ట్ 9 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్ట్‌, ఆగ‌స్ట్ 18 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్‌లో మూడో టెస్ట్‌, ఆగ‌స్ట్ 30 నుంచి ఎజియాస్ బౌల్‌లో నాలుగో టెస్ట్‌, సెప్టెంబ‌ర్ 7న ఓవ‌ల్‌లో ఐదో టెస్ట్ జ‌రుగుతుంది.

ఈ పర్యటన కోహ్లీ సేనకు ఓ పరీక్షలా నిలవనుంది. చివ‌రిసారిగా 2014లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు ధోనీ కెప్టెన్సీలో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా కోహ్లీసేన వెళ్లనుంది. ఇప్పటివరకు ఉపఖండంలో సత్తాచాటిన కోహ్లీసేనకు వచ్చే ఏడాది కఠిన పరీక్ష ఎదురుకానుంది.

ఇంగ్లండ్ పర్యటన పూర్తి షెడ్యూల్:
* జులై 3: తొలి టీ20 - మాంచెస్టర్‌
* జులై 6: రెండో టీ20- కార్డిఫ్‌
* జులై 8: మూడో టీ20 - బ్రిస్టల్‌


* జులై 12: తొలి వన్డే - నాటింగ్‌హామ్‌
* జులై 14: రెండో వన్డే - లార్డ్స్‌
* జులై 17: మూడో వన్డే - లీడ్స్‌


* ఆగస్టు 1-5: తొలి టెస్టు - ఎడ్జ్‌బాస్టన్‌
* ఆగస్టు 9-13: రెండో టెస్టు - లార్డ్స్‌
* ఆగస్టు 18-22: మూడో టెస్టు - నాటింగ్‌హామ్‌
* ఆగస్టు 30 - సెప్టెంబర్‌ 3: నాలుగో టెస్టు - సౌతాంప్టన్‌
* సెప్టెంబర్‌ 7-11: ఐదో టెస్టు - లండన్‌

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+