న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ పర్యటనలో టీమిండియా: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ టెలీకాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

India Vs Australia 2018-19: India to play 3 T20Is, 4 Tests & 3 ODIs | Match Details & Timings
India tour of Australia 2018 Full Schedule: Australia vs India Schedule, Timings in IST, Date, Venue, TV Channel

హైదరాబాద్: స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్‌ జట్టును చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు విదేశీ గడ్డపై మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈ విజయ ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.

సిక్స్‌తో హాఫ్ సెంచరీ: కుర్రన్ ఖాతాలో అరుదైన రికార్డుసిక్స్‌తో హాఫ్ సెంచరీ: కుర్రన్ ఖాతాలో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఇదే ఊపును ఆస్ట్రేలియా గడ్డపై కొనసాగించి జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్ పర్యటనను టీమిండియా మూడు టీ20ల సిరిస్‌తో ప్రారంభనుంది. తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, జనవరి 3 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియాతో భారత్ తలపడే మ్యాచ్‌ల షెడ్యూల్, ఇరు జట్లు, లైవ్ టెలీకాస్ట్ సమయాలను మీకోసం:

ఛానల్: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: Hotstar.com

మూడు టీ20లు

మూడు టీ20లు

తొలి టీ20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)

రెండో టీ20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

మూడో టీ20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

ఆసీస్‌తో మూడు టీ20లకు టీమిండియా:

ఆసీస్‌తో మూడు టీ20లకు టీమిండియా:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

టెస్టు సిరిస్

టెస్టు సిరిస్

తొలి టెస్ట్: డిసెంబర్ 6 నుంచి 10 వరకు - అడిలైడ్ (ఉదయం 6 గంటల నుంచి)

రెండో టెస్ట్: డిసెంబర్ 14 నుంచి 18 వరకు - పెర్త్ (ఉదయం 8 గంటల నుంచి)

మూడో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు - మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటల నుంచి)

నాలుగో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు - సిడ్నీ (ఉదయం 5 గంటల నుంచి)

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులకు టీమిండియా:

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులకు టీమిండియా:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

వన్డే సిరిస్

వన్డే సిరిస్

తొలి వన్డే: జనవరి 12 - సిడ్నీ (ఉదయం 8.50 గంటలకు)

రెండో వన్డే: జనవరి 15 - అడిలైడ్ (ఉదయం 9.20 గంటలకు)

మూడో వన్డే: జనవరి 18 - మెల్‌బోర్న్ (ఉదయం 8.50 గంటలకు)

ఆసీస్‌తో వన్డేలకు భారత జట్టుని సెలక్టర్లు ఇంకా ప్రకటించలేదు.

Story first published: Wednesday, November 14, 2018, 19:57 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X