న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుమతి తీసుకునే 'ఆర్మీ క్యాప్‌'లను: స్పష్టం చేసిన ఐసీసీ

India vs Australia 2019 : India Took Permission From ICC To Wear Army Camouflage Caps : BCCI on Pak
India took permission from ICC to wear army camouflage caps: BCCI on Pakistans protest

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించడానికి తమనుంచి బీసీసీఐ ముందుగానే అనుమతి తీసుకుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి స్పష్టం చేసింది. రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడ‌ో వ‌న్డేలో భారత జట్టులోని ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌ల‌ను ధరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ హత్య కంటే పెద్దది!: 'రోర్‌ ఆఫ్‌ ది లయన్‌'లో ధోనిమ్యాచ్‌ ఫిక్సింగ్‌ హత్య కంటే పెద్దది!: 'రోర్‌ ఆఫ్‌ ది లయన్‌'లో ధోని

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అమరజవాన్ల మృతికి నివాళిగా టీమిండియా మూడో వ్డేలో ఆర్మీ క్యాప్‌ల‌ను ధ‌రించి ఆడారు. ఇలా అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆర్మీ క్యాప్‌లతో పాల్గొనడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి ఆడ‌డం స‌రికాదు

ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు అని అన్నాడు. క్రికెట్‌ను రాజ‌కీయం చేస్తున్న బీసీసీఐపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాక్ స‌మాచార‌శాఖ మంత్రి ఫావ‌ద్ చౌద‌రీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధ‌రించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాల‌ని మంత్రి ఫావ‌ద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు.

పాక్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరిస్తారు

పాక్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరిస్తారు

భారత్‌ ఇటువంటి చర్యలు మానుకోకపోతే పాకిస్థాన్‌ జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరిస్తారన్నారని అన్నాడు. టోపీల వ్యవహారంపై పాక్‌కు చెందిన మరో మంత్రి కూడా స్పందించారు. భారత్‌ కాశ్మీర్‌లో చేస్తున్న దురాగతాలను ప్రపంచానికి చెప్తామని ఆయన ట్విటర్‌లో విమర్శించారు.

స్పష్టతనిచ్చిన బీసీసీఐ

అయితే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ఆర్మీ క్యాప్‌లను ధరించడానికి ముందు ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్‌ వద్ద బీసీసీఐ అనుమతులు తీసుకుందని అన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌ువు కోసం వినియోగించనున్నారు.

Story first published: Monday, March 11, 2019, 10:28 [IST]
Other articles published on Mar 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X