
హైదరాబాద్: జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే కొత్తగా "India Today Inspiration"తో ఓ సరికొత్త సిరిస్‌ను ప్రారంభించింది. ఈ సిరిస్‌లో భారత్‌లోని అతి పెద్ద స్పోర్ట్స్ లెజెండ్స్‌తో సంభాషణ ఉంటుంది. ఈ సిరిస్‌లో మొదటి ఎపిసోడ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీను గెస్ట్‌గా ఆహ్వానించింది.
తొలి ఎపిసోడ్ నవంబర్ 30 సాయంత్రం 6 గంటలకు ఇండియా టుడే టీవీలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్(స్పోర్ట్స్) బొరియా మజుందార్‌తో ఈ చాట్ షో హోస్ట్‌గా వ్యవహారించారు.
ఇందుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే ఇండియా టుడే తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఓడిపోవడాన్ని నేను ద్వేషిస్తాను. నేను బయటికి వెళ్లడానికి ఇష్టపడను. నేను ఇది చేశాను అని చెప్పుకోను. నేను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, అది ఒక ప్రత్యేక హక్కు. నేను బయటకు వెళ్ళినప్పుడు నేను జీరో ఎనర్జీని కలిగి ఉండాలనుకుంటాను. భవిష్యత్ తరాలు కూడా మా గురించి చెప్పుకునేలా మా ఆట తీరు ఉండాలి" అని చెప్పాడు.
అలాగే, అనుష్క శర్మను తాను ఎలా కలిసింది? వారిద్దరి మధ్య సంబంధం ప్రారంభ రోజులలో ఎలా ఉండేది లాంటి విషయాలను కోహ్లీ ఈ కార్యక్రమంలో పంచుకున్నాడు. ఈ కార్యక్రమం నవంబర్ 30న ఇండియా టుడే టీవీలో ప్రసారం కానుంది. ఆరోజు మిస్ అయితే డిసెంబర్ 1వ తేదీ మద్యాహ్నాం 2 గంటలకు, రాత్రి 10 గంటలకు తిరిగి ప్రసారమవుతుంది.