తేదీలు ఖరారు: 2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం!

హైదరాబాద్: 2023లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 23 వరకు ప్రపంచకప్ జరుగుతుంది. ఈ ఏడాది రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన ప్రపంచకప్ మాదిరిగానే వచ్చే ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీని ప్రకారం వచ్చే ప్రపంచకప్‌లో కూడా మొత్తం పదిజట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ నిభందలన ప్రకారం టాప్-8లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు వరల్డ్‌కప్‌కు ముందు జరగనున్న అర్హత టోర్నీలో పోటీ పడతాయి.
ఇండియా ఇప్పటివరకు మూడు సార్లు 1987, 1996, 2011లో ప్రపంచకప్‌కు ఆతిధ్యం ఇచ్చింది. అయితే ఈ మూడు సార్లు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి ప్రపంచకప్‌కి ఆతిధ్యం ఇవ్వడం విశేషం. అయితే, ఈసారి మాత్రం ఒక్క భారతే మొత్తం వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనుంది.
కాగా, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టే ట్రోఫీని కైవసం చేసుకున్న సంగత తెలిసిందే. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన 2019 ప్రపంచకప్‌ను 44 ఏళ్ల తర్వాత క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ట్రోఫీని గెలుచుకుంది.
కాగా, లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు. సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్ల సమానంగా పరుగులు చేయడంతో 'బౌండరీ రూల్' ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications