Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దాదా ఒప్పించాడు: కోల్‌కతా వేదికగా నవంబర్ 22న భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు

India vs Bangladesh 2019 : India To Host 1st Ever Day-Night Test In Kolkata || Oneindia Telugu
India to host 1st ever day-night Test in Kolkata after Bangladesh agree to BCCI proposal

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఎత్తుగడ. భారత క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టును డే/నైట్‌‌గా నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీరించింది. దీంతో నవంబర్ 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ తొలి పింక్ బాల్ టెస్టును నిర్వహించనుంది.

డే/నైట్ టెస్టుపై ఎప్పట్నుంచో సానుకూలత వ్యక్తం చేస్తున్న సౌరభ్‌ గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. డే/నైట్ టెస్టు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
సముఖంగా ఉన్నాడని ఇటీవలే వెల్లడించిన సౌరవ్ గంగూలీ... బంగ్లాదేశ్‌ జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఈడెన్‌గార్డెన్‌ వేదికగా జరగాల్సిన రెండో టెస్టును పింక్ బాల్ టెస్టుగా ఆడాలని బీసీబీకు ప్రతిపాదన పంపాడు.

ఆటగాళ్లతో చర్చించి

ఆటగాళ్లతో చర్చించి

ఆటగాళ్లతో చర్చించి రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు తెలిపింది. "మూడు రోజుల క్రితం బీసీసీఐ నుంచి మాకు ఓ లేఖ అందింది. డేనైట్‌ టెస్టు ఆడాలని లేఖలో బీసీసీఐ కోరింది. రెండు రోజుల్లో దానిపై ఆలోచించి బీసీబీ నిర్ణయాన్ని వెల్లడిస్తాం. అయితే ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేదు. డేనైట్‌ టెస్టులు క్రికెట్ ఆటకు ఎంతో దోహదం చేస్తాయని నా అభిప్రాయం. అందరితో చర్చిస్తాం" అని అక్రమ్‌ఖాన్‌ తెలిపారు.

బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించిన బీసీబీ

బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించిన బీసీబీ

"డే/నైట్‌ టెస్టు గురించి బంగ్లా క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడితో మాట్లాడా. వాళ్లు సుముఖంగానే ఉన్నారు. ఆటగాళ్లతో మాట్లాడి త్వరగా అంగీకారం తెలియజేస్తామని చెప్పారు" అని గంగూలీ తెలిపాడు. తాజాగా డే/నైట్ టెస్టు గురించి ఆటగాళ్లు, యాజమాన్యంతో చర్చించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించింది. దీంతో నవంబర్ 22న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్ తొలి పింక్ బాల్ టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను కోల్పోయే ప్రమాదం

టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను కోల్పోయే ప్రమాదం

ఈడెన్ గార్డెన్స్ డే/నైట్ టెస్టుని వార్షిక వ్యవహారంగా బీసీసీఐ పరిశీలిస్తుందని సౌరవ్ గంగూలీ ఈ సందర్భంగా చెప్పారు. భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు నిర్వహిస్తున్నామని బీసీసీఐ ప్రకటించి ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. అయితే, ఫ్లడ్ లైట్ల కింద టీమిండియా తగినంత ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేదని, ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను కోల్పోయే ప్రమాదం ఉందని క్రికెట్ బాడీ వాదించింది.

భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ తప్ప

భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ తప్ప

భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్‌ టెస్టులు ఆడాయి. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్‌ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌‌లో గతేడాది ప్రయోగాత్మకంగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు.

పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో

పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో

అయితే, పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో బీసీసీఐ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌ను డే/నైట్‌లో ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

కోల్‌కతా వేదికగా నవంబర్ 22న భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు

కోల్‌కతా వేదికగా నవంబర్ 22న భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు

భారత్ పర్యటనలో బంగ్లాదేశ్‌ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది.

Story first published: Tuesday, October 29, 2019, 20:42 [IST]
Other articles published on Oct 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+