దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపిక.. కేఎల్ రాహుల్‌కు చోటు కష్టమే?

న్యూఢిల్లీ: టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో ఓపెనర్‌గా రోహిత్ శర్మ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు గురువారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సెలెక్టర్లు ఓపెనర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఓపెనర్‌గా రోహిత్:
గతంలో రోహిత్ టెస్టు ఫార్మాట్‌లో 5 లేదా 6వ స్థానంలో వచ్చేవాడు. ఫామ్ కోల్పోవడంతో ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అజింక్య రహానే, హనుమ విహారి అదరగొడుతుండటంతో రోహిత్‌ను సఫారీ సిరీస్‌కు ఓపెనర్‌గానే తీసుకునే చాన్స్ ఉంది. మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌లా టెస్టుల్లోనూ ధాటిగా ఆడే ప్లేయర్‌గా రోహిత్‌ను ప్రయోగించాలని కోచ్ రవిశాస్త్రి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌పై వేటు?:
తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. త్వరలో జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొన్నాడు. ఎమ్మెస్కే మాటలను బట్టి చూస్తే.. రాహుల్‌పై వేటు పడడం కాయంగా కనిపిస్తోంది.

వెస్టిండీస్ పర్యటనలో విఫలం:
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్టులో రాహుల్ విఫలమయ్యాడు. 44, 38, 13, 6 పరుగులు చేసాడు. తొలి టెస్టులో మంచి పరుగులే చేసినా.. భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. ఇక రెండో టెస్టులో 19 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. రాహుల్ ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో చేసిన 149 పరుగులే అత్యుత్తమం. ఆడిన చివరి 12 ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేదు.

అగర్వాల్‌కు చోటు ఖాయం:
మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కు చోటు ఖాయం. ఒకవేళ రాహుల్‌ను తప్పిస్తే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు ప్రియాంక్ పంచల్, శుభ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నారు. మూడో స్థానంలో పుజార, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ వస్తారు. అనంతరం రహానే, విహారి ఉన్నారు. ఇక పేసర్లుగా బుమ్రా, షమీ, ఇషాంత్.. స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్, అశ్విన్‌కు జట్టులో చోటు దక్కనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications