ట్వంటీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం, రోహిత్ శర్మ దూకుడు

భారత్ గెలుపు తేలిగ్గా ఏం లభించలేదు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించిన ఓపెనర్ వాన్‌విక్ (67; 39 బంతుల్లో 5X4, 5X6) భయపెట్టాడు. ఆమ్లా (1), ఇంగ్రామ్ (2) త్వరగానే నిష్క్రమించినా.. వాన్‌విక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. డివిలియర్స్ (14) ఎక్కువ పరుగులు చేయకపోయినా వాన్‌విక్‌కు అండగా నిలిచి విలువైన భాగస్వామ్యం (57) నెలకొల్పాడు. మరికొద్దిసేపు వీరి భాగస్వామ్యం సాగివుంటే భారత్ గెలుపు కష్టమయ్యేదే. కానీ యువీ తన తొలి ఓవర్లోనే మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడి తొలి ఓవర్లో నెహ్రా నుంచి త్రో అందుకున్న రైనా..డివిలియర్స్‌ను రనౌట్ చేశాడు. మరో మూడు బంతులకే డుమిని (0)ని పెవిలియన్ పంపాడు యువీ. తర్వాతి ఓవర్లో వాన్ విక్ ను ప్రవీణ్ కుమార్ ఔట్ చేశాడు. అంతే గెలుపు దిశగా సాగుతున్నట్లు కనిపించిన సఫారీ జట్టు.. విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
భారత ఇన్నింగ్స్‌లో మెరుపువీరుడు రోహిత్ శర్మనే. సెహ్వాగ్‌కు గాయం కావడంతో జట్టులోకి వచ్చిన అతడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అర్ధసెంచరీ సత్తా చాటాడు. మురళీ విజయ్ (14; 12 బంతుల్లో 3X4) ఔటవడంతో మూడో ఓవర్లోనే బరిలోకి దిగాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్..తర్వాత స్త్టెలిష్ షాట్లతో చెలరేగాడు. ఎన్తిని వేసిన ఐదో ఓవర్లో బౌండరీ, సిక్స్ బాదాడు. రోహిత్ జోరు కొనసాగించడంతో పవర్‌ప్లే (తొలి 6 ఓవర్లు)లో టీమ్‌ఇండియా 57 పరుగులు పిండుకుంది. బోథా వేసిన 12వ ఓవర్లో రోహిత్ వరుసగా 4, 4, 6తో రెచ్చిపోవడంతో భారత స్కోరు పరుగులెత్తింది. డుమిని ఓవర్లో ఫోర్‌తో అర్ధసెంచరీ (32 బంతుల్లో) పూర్తిచేసుకున్న రోహిత్.. లాంగాన్ లో సిక్సర్ కొట్టబోయి ఎన్తిని చేతికి చిక్కాడు. అప్పుడు జట్టు స్కోరు 109/3.
రోహిత్ ఔటయ్యాక రైనా వంతు మొదలైంది. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రైనా భారీ షాట్లతో కదంతొక్కాడు. ఎన్తిని వేసిన 15వ ఓవర్లో ఫోర్ బాదిన అతడు.. థెరాన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 4, 6తో చెలరేగాడు. స్టాండ్స్‌లోకి మరో రెండు సిక్స్‌లు కొట్టిన రైనా..ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. థెరాన్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి 28 పరుగులు చేశాడు. యువీ (12), యూసుఫ్ (6) విఫలమయ్యారు. సచిన్, జహీర్, భజ్జీ, శ్రీశాంత్‌లకు టీం మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
భారత్ ఇన్నింగ్స్: కోహ్లి (బి) బోథా 28; మురళీ విజయ్ (సి) వాన్‌విక్ (బి) పార్నెల్ 14; రోహిత్ శర్మ (సి) ఎన్తిని (బి) డుమిని 53; యువరాజ్ రనౌట్ 12; యూసుఫ్ పఠాన్ (బి) థెరాన్ 6; రైనా (సి) మిల్లర్ (బి) థెరాన్ 41; ధోనీ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168; వికెట్ల పతనం: 1-18, 2-67, 3-109, 4-110, 5-136, 6-168
బౌలింగ్: పార్నెల్ 4-0-25-1; ఎన్తిని 4-0-46-0; థెరాన్ 4-0-39-2; రాబిన్ పీటర్సన్ 3-0-20-0; బోథా 3-0-25-1; డుమిని 2-0-12-1
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వాన్ విక్ (సి) నెహ్రా (బి) ప్రవీణ్ కుమార్ 67; ఆమ్లా (బి) నెహ్రా 1; ఇంగ్రామ్ (సి) ప్రవీణ్ (బి) మునాఫ్ 2; డివిలియర్స్ రనౌట్ 14; డుమిని ఎల్బీ (బి) యువరాజ్ 0; మిల్లర్ ఎల్బీ (బి) యూసుఫ్ పఠాన్ 10; బోథా (సి) రోహిత్ (బి) నెహ్రా 25; రాబిన్ పీటర్సన్ (సి) కోహ్లి (బి) యూసుఫ్ 2; పార్నెల్ (సి) యూసుఫ్ (బి) అశ్విన్ 14; థెరాన్ నాటౌట్ 1; ఎన్తిని నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు)147; వికెట్ల పతనం: 1-6, 2-31, 3-88, 4-89, 5-93, 6-108, 7-120, 8-141, 9-144
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3-0-17-1; నెహ్రా 4-0-22-2; మునాఫ్ పటేల్ 2-0-26-1; అశ్విన్ 4-0-33-1; యువరాజ్ 4-0-20-1; యూసుఫ్ 3-0-22-2
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications