రాహుల్‌కు షాక్.. సైనీ, అగర్వాల్‌కు చోటు.. భారత టెస్టు జట్టు ఇదే!!

ముంబై: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. భారత టెస్టు జట్టులో యువ పేసర్ నవదీప్ సైనీకి చోటు దక్కింది. సైనీతో పాటు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలు కూడా చోటు దక్కించుకున్నారు. అయితే అనతికాలంలోనే స్టార్ ఓపెనర్‌గా ఎదిగిన కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సెలక్టర్లు షాక్ ఇచ్చారు. కివీస్‌తో ముగిసిన టీ20లలో దుమ్ములేపిన రాహుల్‌కు టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు మొండిచేయి చూపారు.

రోహిత్ స్థానంలో మయాంక్:
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో గాయపడిన సీనియర్ పేసర్ ఇషాంత్ ఇషాంత్ శర్మకు కూడా సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. అయితే ఇషాంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. మౌంట్ మాంగనుయిలో జరిగిన చివరి టీ20లో గాయపడి వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చారు. ఇక గిల్‌కు అవకాశం ఇవ్వడంతో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ తిరిగి సుదీర్ఘ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకోవాలనుకున్న అతడికి నిరాశే మిగిలింది.

పృథ్వీ షాకు జోడి ఎవరు?
చివరి టీ20లో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ గాయం (పిక్క కండరాలు పట్టేయడం) కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లకు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో వన్డే సిరీస్‌కు మయాంక్ అవకాశం దక్కించుకున్నాడు. పృథ్వీ షాతో మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రాహుల్ ఐదవ స్థానంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ షాతో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

హామిల్టన్‌లో తొలి వన్డే:
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విదేశీ గడ్డపై భారత జట్టు టీ20 సిరీస్‌లను మూడోసారి వైట్‌వాష్ చేసింది. ఇక న్యూజిలాండ్-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 5న హామిల్టన్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ అనంతరం టెస్ట్ సిరీస్ ఉంది.

భారత టెస్ట్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్) మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (కీపర్), రిషభ్‌పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, ఇషాంత్‌శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications