శ్రీశాంత్ వంటి దూకుడు ఆటగాడుండాలి: ధోనీ
ముంబయి: శ్రీశాంత్ వంటి దూకుడు ఆటగాళ్లు జట్టుకు అవసరమని భారత్ ట్వంటీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. తనకు, తన జట్టుకు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన సన్మానం అనంతరం ఆయన కార్యక్రమ వ్యాఖ్యాత హర్ష భోగ్లే వేదిక మీద వేసిన ప్రశ్నలకు సభాముఖంగా జవాబులు ఇచ్చారు. సమష్టిగా ఆడడం వల్లనే తాము గెలిచామని ధోనీ చెప్పాడు. జట్టులోని అందరు ఆటగాళ్లు బాగా ఆడుతున్నప్పుడు కెప్టెన్ కూల్ గా ఉండడానికి అవకాశం ఉంటుందని, తాను కూల్ గా ఉండడానికి కారణమదేనని ఆయన అన్నారు.
ముంబయి నగరం ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుందని, అయితే తాము దాన్ని ఈ రోజు నిలబెట్టామని ఆయన అన్నారు. తమకు స్వాగతం చెప్పడానికి వచ్చిన ప్రజలను చూస్తే ప్రపంచ కప్ గెలిచినందుకు తమ కన్నా ఎక్కువగా ప్రజలు ఎక్కువ ఆనందిస్తున్నారనేది అర్థమైందని ఆయన అన్నారు. ముంబయి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ప్రపంచ కప్ విజయం కన్నా ప్రజల అభిమానం ఎక్కువ ఆనందాన్నిస్తోందని ఆయన అన్నారు. వచ్చే ప్రతి మ్యాచులోనూ గెలవడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ధోనీ నాయకత్వం స్ఫూర్తిదాయకమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ మెచ్చుకున్నారు. భారత జట్టు సన్మానోత్పవానికి వచ్చిన జనంతో వాంఖడే స్టేడియం కిటకిటలాడింది.
Story first published: Wednesday, September 26, 2007, 23:53 [IST]
Other articles published on Sep 26, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications