For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ పై అదరగొట్టిన స్పిన్నర్లు: సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా

By Srinivas
India
నాగపూర్: భారత్ కు న్యూజిలాండుకు మధ్య నాగపూర్లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఒకరోజుకు పైగా మిగిలి ఉండగానే మంగళవారం విజయాన్ని కైవసం చేసుకొని సిరీస్ ను గెలుచుకుంది. 198 పరుగుల ఆధిక్యంతో భారత్ గెలిచింది. రెండో ఇన్నింగ్సులో స్పిన్నర్సు కీలక పాత్ర పోషించారు. సోమవారం రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన న్యూజిలాండు ఆట ముగిసే సమాయనికి మెకంతోష్ వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. అప్పటికే ఏదో అద్భుతం జరిగితే గాని న్యూజిలాండ్ సిరీస్ సమం చేసే అవకాశాలు కనిపించలేదు. నాలుగోరోజైన మంగళవారం ఆట ప్రారంభం కాగానే వికెట్లు టపటపా రాలాయి. దీంతో న్యూజిలాండు పరాజయం లాంఛనమే అన్నట్టు అయింది. భోజన విరామ సమాయానికే 140 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండు ఓటమికి పూర్తిగా చేరువయ్యింది. అప్పటికి ఓజా 2, హర్భజన్ 3 ఇషాంత్ 3, రైనా 2 వికెట్లు తీసుకున్నారు. సోథీ 31, టైలర్ 29, మెకల్లమ్ 25 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్సులో స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండు బ్యాట్సుమెన్ 175 పరుగులకే ఆలౌటయ్యారు. మొదటి ఇన్నింగ్సులో రాహుల్ ద్రావిడ్(191) ఏమాత్రం తడబడకుండా నిదానంగా ఆడి భారత్ కు భారీ అధిక్యతలో నిలిపాడు.

న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్సులో 193 పరుగులకే ఆలవుటయ్యింది. రైడర్ 59, మెకల్లమ్ 40, సోథీ 38 పరుగులు చేశారు. అందుకు భారత్ ధీటుగా స్పందించింది. భారత్ 566 పరుగుల భారీ పరుగుల వద్ద డిక్లేర్ చేసి న్యూజిలాండును సెకండ్ ఇన్నింగ్సుకు ఆహ్వానించింది. అప్పటికి భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భజ్జీ 20 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద అవుటవడంతో డిక్లేర్ చేసింది. అప్పడు భారత్ ఆధిక్యం 373 పరుగులు. ఈ ఆటలో కెప్టెన్ మహేంధ్రసింగ్ ధోని సెంచరీ(98) మిస్ చేసుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ సైతం తన డబుల్ సెంచరీని (191) మిస్ చేసుకున్నాడు. గంభీర్ 78, సెహ్వాగ్ 74, సచిన్ 61, భజ్జీ 20 పరుగులు చేశారు. సురేశ్ రైనా మరోసారి విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులకే అవుటయి పెవిలియన్ దారి పట్టాడు.

అంతకుముందు అహ్మదాబాదులో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమి అంచునుంచి వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ కు భజ్జీ తోడవటంతో గట్టెక్కింది. ఇక హైదరాబాదులో జరిగిన రెండో టెస్టులు అదే లక్ష్మణ్, భజ్జీలు భారత్ ను భారీ అధిక్యంలో ఉండి విజయానికి బాటలు వేసినప్పటికి మెకల్లమ్ భారత్ ఆశలపై నీళ్లు జల్లాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+