Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనిపై వేటు, కోహ్లీకి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్: టీ20 క్రికెట్‌ కెరీర్‌ ముగిసినట్లేనా?

ICC World T20 : MS Dhoni Dropped From India's T20I Squad
India T20I squads for Windies, Australia series announced; MS Dhoni dropped; Kohli rested against WI

హైదరాబాద్: టీ20 క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇక మనకు టీమిండియా దుస్తుల్లో కనపడకపోవచ్చు. అవును.. ధోని టీ20 ఇన్నింగ్స్‌ దాదాపుగా ముగిసినట్లే. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అతడికి టీ20 క్రికెట్‌ నుంచి ఉద్వాసన పలికింది.

వెస్టిండీస్‌తో నవంబర్ 4 నుంచి మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌కోసం ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 16 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీపై వేటు వేశారు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్న 37 ఏళ్ల ధోనిపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరం.

టీ20ల్లో ధోని కెరీర్‌ ముగిసినట్టే

టీ20ల్లో ధోని కెరీర్‌ ముగిసినట్టే

టీ20ల్లో ధోని కెరీర్‌ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాత్రం వీటిని ఖండించారు. "ధోనీ ఆరు టీ20ల్లో ఆడడం లేదు. మేం సమర్థుడైన రెండో వికెట్‌కీపర్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు" అని స్పష్టం చేశారు. టీమిండియా ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 93 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు. అతడు 127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేశాడు.

 విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి

విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి

మరోవైపు మూడు టీ20ల సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న షాబాజ్ నదీమ్‌తో పాటు కృనాల్‌ పాండ్యాకు అవకాశం లభించింది. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 16 మందితో జట్టును ఎంపిక చేశారు.

 కోహ్లీపై పనిభారం పడకూదని

కోహ్లీపై పనిభారం పడకూదని

టెస్టు సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌ పూర్తిగా ఆడుతుండడంతో అతడిపై పనిభారం పడకూడదని సెలెక్టర్లు భావించారు. అయితే నవంబరు 21 నుంచి ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు. దీంతో పాటు నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ కెప్టెన్‌గా 18 మందితో జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో విఫలమై టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన మురళీ విజయ్‌ తిరిగి ఆసీస్‌తో టెస్టులకు ఎంపికయ్యాడు.

ఆసీస్‌తో టెస్టు జట్టులో రోహిత్ శర్మ, హనుమ విహారి

హనుమ విహారికి మరో అవకాశం దక్కింది. ఓపెనర్ రోహిత్‌శర్మ, వికెట్‌కీపర్‌‌గా పార్థివ్‌ పటేల్‌ టెస్టు పునరాగమనం చేశాడు. ఈ సిరిస్‌లో పంత్‌తో పాటు పార్థివ్‌ పటేల్‌ కీపర్లుగా వ్యవహరించనున్నాడు. నవంబరు 21న ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. దీంతో పాటు న్యూజిలాండ్ ఎతో 15 మందితో భారత్ ఎ జట్టును ప్రకటించారు.

విండీస్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధవన్‌, కె.ఎల్‌ రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌, జస్ర్పీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేష్‌ యాదవ్‌, షాబాజ్‌ నదీమ్‌.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, మనీష్‌ పాండే, దినేష్‌ కార్తీక్‌, పంత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌, బుమ్రా, ఉమేష్‌, ఖలీల్‌ అహ్మద్‌.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు:

కోహ్లీ (కెప్టెన్‌), మురళీ విజయ్‌, రాహుల్‌, పృథ్వీ షా, పుజారా, రహానె, హనుమ విహారి, రోహిత్‌, పంత్‌, పార్థివ్‌ పటేల్‌, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, షమీ, ఇషాంత్‌, ఉమేష్‌, బుమ్రా, భువనేశ్వర్‌.

న్యూజిలాండ్‌-ఎతో మ్యాచ్‌కు భారత్‌-ఎ జట్టు:

అజింక్యా రహానె (కెప్టెన్‌), మురళీ విజయ్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, విహారి, రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), కె.గౌతమ్‌, షాబాజ్‌ నదీమ్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, గుర్బాని, విజయ్‌ శంకర్‌, కె.ఎస్‌ భరత్‌.

Story first published: Saturday, October 27, 2018, 10:56 [IST]
Other articles published on Oct 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+