T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై వేటు.. భారత జట్టులోకి శార్దూల్ ఠాకూర్! మరిన్ని మార్పులూ త‌ప్ప‌వా?

T20 World Cup 2021 : Hardik Pandya To Be Dropped, These Players Likely To Replace || Oneindia Telugu

ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముగ్గురు స్టాండ్‌ బై ప్లేయర్స్‌ కూడా మెగా టోర్నీకి ఎంపికయ్యారు. తుది జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అన్ని జట్లకు అవ‌కాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో రెండు మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఇందుకు కారణం మాత్రం ఆటగాళ్ల ఫామే కారణం. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో ఆడుతున్న ప్రపంచకప్ ప్లేయ‌ర్స్ సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌, హార్దిక్ పాండ్యాలు ఫామ్‌లో లేరు. దీంతో వీళ్ల స్థానంలో ఇత‌ర ప్లేయ‌ర్స్‌కు అవ‌కాశం ద‌క్కనున్న‌ట్లు బోర్డు వ‌ర్గాలు ఓ ప్రకటనలో వెల్ల‌డించాయి.

జట్టులోకి శార్దూల్ ఠాకూర్

జట్టులోకి శార్దూల్ ఠాకూర్

టీ20 ప్రపంచకప్‌ 2021లో చోటు దక్కించుకున్న సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌, హార్దిక్ పాండ్యాలు ఫామ్‌లో లేరు. ఐపీఎల్ 2021 రెండో దశలో ఈ ముగ్గురు ఒక్క మ్యాచులో కూడా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా హార్దిక్ ఫిట్‌నెస్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐపీఎల్‌లో అతడు ఒక్క ఓవ‌ర్ కూడా వేయ‌లేదు.

దీంతో అత‌ని స్థానంలో ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పేసర్ దీప‌క్ చ‌హ‌ర్‌ను కూడా తీసుకునే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. సూర్య‌కుమార్, ఇషాన్ ఇద్దరిలో ఒకరికి బదులుగా ప్ర‌స్తుతం బ్యాక‌ప్ ప్లేయ‌ర్‌గా ఉన్న‌ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు 15 మంది స‌భ్యుల్లో చోటు ద‌క్కే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

బ్యాక‌ప్‌గా సిద్ధంగా ఉన్నాడు

బ్యాక‌ప్‌గా సిద్ధంగా ఉన్నాడు

'ప్ర‌స్తుతం కొందరి ప్లేయ‌ర్స్ ఫామ్ ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. అయితే వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వ‌స్తార‌నే నమ్మకం ఉంది. సూర్య‌కుమార్ యాదవ్ భారత జట్టుకు బాగానే ఆడాడు. అలాగే ఇషాన్ కిష‌న్ కూడా శ్రీలంక‌లో రాణించాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ సాదించాడు. అయితే ఇంతవరకు అతడు బౌలింగ్ చేయలేదు.

ఈ ముగ్గురూ రానున్న మ్యాచ్‌ల‌లో అనుకున్న రీతిలో రాణించ‌క‌పోతే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాక‌ప్‌గా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడే దీనిపై స్ప‌ష్టంగా చెప్ప‌డం కష్టం. ఏది చెప్పినా ఇపుడు తొందరపాటు అవుతుంది. ఏదేమైనా ఈ ప్లేయ‌ర్స్ తిరిగి ఫామ్‌లోకి రావ‌డానికి మ‌రో 12 రోజుల స‌మ‌యం ఉంది' అని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు.

'టీ20 క్రికెట్‌లో చహల్ గొప్ప ఆస్తి.. టీ20 ప్రపంచకప్‌కు ఎందుకు సెలెక్ట్ చేయలేదు! సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి'

కోహ్లీ లానే మిగ‌తా ప్లేయ‌ర్స్

కోహ్లీ లానే మిగ‌తా ప్లేయ‌ర్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక‌పోయినా.. ఐపీఎల్ 2021లో రెండు వ‌రుస హాఫ్ సెంచ‌రీలు కొట్టాడ‌ని సదరు బీసీసీఐ అధికారి గుర్తుచేశాడు. కోహ్లీ లానే మిగ‌తా ప్లేయ‌ర్స్ కూడా ఫామ్‌లోకి వ‌స్తార‌న్న ఆశాభావాన్ని ఆ అధికారి వ్య‌క్తం చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు శిఖ‌ర్ ధావ‌న్‌, య‌జువేంద్ర చహ‌ల్‌ లాంటి ప్లేయ‌ర్స్ కూడా త‌మ‌కు టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం బీసీసీఐ నుంచి పిలుపు వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.

మొత్తానికి అక్టోబ‌ర్ 10 లోగా బీసీసీఐ మరోసారి భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. అక్టోబర్ 23న అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 28, 2021, 14:14 [IST]
Other articles published on Sep 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X