
హైదరాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కారణం రోహిత్‌కు గాయం అవ్వడమే. ప్రస్తుతం షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో ముంబై కెప్టెన్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంతిని ఆపే క్రమంలో రోహిత్ డైవ్ వేశాడు. దాంతో అతడికి గాయం అయింది. ముంబై జట్టు ఫిజియో వచ్చి చికిత్స చేసినా.. వెంటనే రోహిత్ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అయిన గాయంపై ఎలాంటి సమాచారం లేదు.
అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానాన్ని వీడుతున్న సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ గాయంపై స్పందించాడు. రోహిత్‌కు అయిన గాయం చూస్తుంటే.. టీమిండియాకు షాక్ తగిలేలా ఉందన్నాడు. బహుశా రోహిత్ టీ20 ప్రపంచకప్ 2021కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని హేడెన్ పేర్కొన్నాడు. వ్యాఖ్యాత హేడెన్ చెప్పిందే నిజమయితే.. భారత జట్టుకు భారీ షాక్ తగులుతుంది. ఐపీఎల్ 2021 రెండో దశలో రోహిత్ శర్మ గాయపడడం ఇది రెండోసారి. ఇటీవల కూడా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముగ్గురు స్టాండ్ బై ప్లేయర్స్ కూడా మెగా టోర్నీకి ఎంపికయ్యారు. తుది జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకూ ఐసీసీ అన్ని జట్లకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో రెండు మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందుకు కారణం మాత్రం ఆటగాళ్ల ఫామే కారణం. ముఖ్యంగా ఐపీఎల్ 2021లో ఆడుతున్న ప్రపంచకప్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు ఫామ్‌లో లేరు. దీంతో వీళ్ల స్థానంలో ఇతర ప్లేయర్స్‌కు అవకాశం దక్కనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.