For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC:యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్లదే హవా.. ఆ ఇద్దరిని కాదని అశ్విన్‌కు చోటు దక్కేనా? జట్టు ఎంపికపై నెలకొన్న ఆసక్తి

India T20 Squad For World Cup: Will Ravi Ashwin Be Picked In The Squad?
T20 WC Squad : R Ashwin ? Rahul Chahar Or Varun Chakravarthy || Oneindia Telugu

హైదరాబాద్: సెప్టెంబర్ 17న యూఏఈలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం భారత జట్టును త్వరలోనే (బుధవారం) ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. చేతన్‌ శర్మ సారథ్యంలోని భారత సెలక్షన్‌ కమిటీ.. ఇంగ్లండ్‌లో ఉన్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాతో ఇప్పటికే వర్చువల్‌గా సమావేశమై జట్టు ఎంపికపై చర్చించారని సమాచారం.

ఈరోజు భారత సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 18 మంది లేదా 20 మంది ఆటగాళ్ల బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేయనుంది. సహాయక సిబ్బందితో కలిసి మొత్తం 30 మంది సభ్యుల బృందాన్ని ఐసీసీ అనుమతిస్తుంది.

వీరికి చోటు ఖాయమే

వీరికి చోటు ఖాయమే

కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఇప్పటికే చర్చించిన భారత సెలక్షన్‌ కమిటీ ప్రధాన జట్టు కూర్పుపై ఓ స్పష్టతతో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించారట. ఇక జట్టులో అదనపు, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్‌, మొహమ్మద్ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌లకు భారత బృందంలో చోటు దాదాపుగా ఖరారైనట్లే.

అశ్విన్‌కు చోటు దక్కేనా

అశ్విన్‌కు చోటు దక్కేనా

సాధారణంగా యూఏఈ పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి. దాంతో స్పిన్నర్లు అక్కడ రాణించే అవకాశాలు అధికం. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్లదే హవా ఉండనున్న నేపథ్యంలో అన్ని జట్లు ఆ విభాగంను పటిష్టంగా మారుస్తున్నాయి. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు.

స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చహల్‌, రవీంద్ర జడేజా జట్టులో ఉండనున్నారు. ఇక మూడో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్ స్టార్లు వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చహర్‌ మధ్య పోటీ ఉంది. వీరితో పాటు యూఏఈలో గతేడాది ఐపీఎల్ టోర్నీలో రాణించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ రేసులో ఉన్నాడని సమాచారం. అయితే చక్రవర్తి, చహర్‌లను కాదని అశ్విన్‌కు చోటు దక్కడం కాస్త కష్టమే. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎవరికి ఓటేస్తాడో చూడాలి.

India vs England: 'ఒప్పుకుంటున్నా.. భారత్ మెరుగైన జట్టు! ఇంగ్లండ్ లోపాల్ని ఎత్తి చూపింది'

కిషన్‌కే ఎక్కువ అవకాశాలు

కిషన్‌కే ఎక్కువ అవకాశాలు

టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ ఓపెన‌ర్లుగా దాదాపు ఖాయ‌మైన‌ట్లే. మూడో ఓపెన‌ర్ స్థానం కోసం పృథ్వి షా, శిఖర్ ధావ‌న్ మ‌ధ్య పోటీ ఉంటుంది. మిడిలార్డ‌ర్‌లో విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, రిష‌బ్ పంత్‌ ఉంటారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు దక్కనుంది. పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్‌ కుమార్, దీప‌క్ చ‌హ‌ర్‌.. స్పిన్ విభాగంలో య‌జువేంద్ర చహ‌ల్ ఖాయం.

ఆల్‌రౌండ‌ర్ల‌లో రవీంద్ర జ‌డేజా, హార్దిక్ పాండ్యా త‌మ స్థానాల‌ను ఖాయం చేసుకుంటారు. శార్దూల్‌ ఠాకూర్‌ ఎంపిక లాంఛనంగానే కనబడుతోంది. ఇప్పటికే జట్టులో రాహుల్‌, పంత్‌ రూపంలో ఇద్దరు వికెట్‌ కీపర్లున్నారు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా కిషాన్‌ కిషన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీలంకలో సంజు శాంసన్‌ విఫలమయిన విషయం తెలిసిందే.

అక్టోబ‌ర్ 17 నుంచి

అక్టోబ‌ర్ 17 నుంచి

ఈ ఏడాది అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే.. సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జట్లు ఆడ‌నున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Story first published: Wednesday, September 8, 2021, 12:01 [IST]
Other articles published on Sep 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+