India vs Sri Lanka:వ‌న్డేల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా..ఇప్పటివరకు ఏ జట్టుకి సాధ్యం కాలేదు!

కొలంబో: మంగళవారం ప్రేమదాస మైదానంలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. పేసర్ దీపక్‌ చహర్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. భారత్ 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అసమాన పోరాటం కనబర్చిన చహర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.

అత్యధిక విజయాలు

అత్యధిక విజయాలు

రెండో వ‌న్డే గెలిచిన టీమిండియా పలు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యపడని ఓ అరుదైన ప్రపంచ రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఓ ప్రత్యర్ధి (శ్రీలంక)పై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది. రెండో వన్డే మ్యాచ్‌లో విజయం అందుకోవడంతో టీమిండియా.. శ్రీలంకపై 93వ విజయాన్ని నమోదు చేసింది.

గతంలో వన్డేల్లో ఏ జట్టు కూడా ఓ ప్రత్యర్ధి ఇన్ని విజయాలు నమోదు చేయలేదు. ఇన్నాళ్లూ న్యూజిలాండ్‌పై 92 విజ‌యాల‌తో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. భారత్‌ (శ్రీలంకపై 92 విజయాలు), పాకిస్తాన్‌ (శ్రీలంకపై 92 విజయాలు) జట్లు కూడా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా ఉన్నాయి. ఇప్పడు మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉంది.

వ‌రుస‌గా ప‌దో విజ‌యం

వ‌రుస‌గా ప‌దో విజ‌యం

తాజా విజయం ద్వారా టీమిండియా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకపై భారత్‌కు వ‌రుస‌గా ప‌దో విజ‌యం కాగా.. వ‌రుస‌గా తొమ్మిదో సిరీస్ విజ‌యంగా కూడా నిలిచింది. ఆటగాళ్లు కూడా రికార్డులు నెలకొల్పారు. స్టార్ పేసర్ దీప‌క్ చహ‌ర్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండో అత్యధిక పరుగులు (69 నాటౌట్‌) సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

అత‌ని కంటే ముందు 2019 ప్రపంచక‌ప్ సెమీఫైన‌ల్లో ర‌వీంద్ర జడేజా ఇదే స్థానంలో వ‌చ్చి 77 ప‌రుగులు చేశాడు. అయితే చహ‌ర్ టీమిండియాను గెలిపించగా.. జడేజా మాత్రం విజయం ముంగిట పెవిలియన్ చేరాడు.

చాంపియ‌న్ టీమ్‌లా ఆడారు.. ఓడిపోయినా పోరాటం గొప్పదే!డ్రెస్సింగ్‌ రూమ్‌లో ద్రవిడ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌!

Ind Vs SL : Deepak Chahar వీరోచిత పోరాటం.. సీరీస్ Teamindia కైవసం | Oneindia Telugu
రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌

రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌

సీనియర్ పేసర్ భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌తో క‌లిసి దీప‌క్ చహ‌ర్ నెల‌కొల్పిన 84 ప‌రుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు భారత్ త‌ర‌ఫున రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. 2017లో ఎంఎస్ ధోనీతో క‌లిసి భువ‌నేశ్వ‌ర్‌.. శ్రీలంక‌పైనే 8వ వికెట్‌కు 100 ప‌రుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. రెండు భాగస్వామ్యంలలో భువీ పాత్ర ఉండడం విశేషం.

తొలి వన్డే ద్వారా భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్‌గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమియా పగ్గాలు అందుకున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 21, 2021, 17:34 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X