IND vs PAK Tension: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారత్‌లోని అనేక ప్రాంతాలపై కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార చర్యను ప్రారంభించింది. భారత సైన్యం లాహోర్‌తో సహా పాకిస్థాన్‌లోని అనేక పెద్ద నగరాలపై దాడి చేసింది. ఇంతలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేయడం ద్వారా భారత సైన్యాన్ని ప్రోత్సహించాడు. పాకిస్థాన్ యుద్ధాన్ని ఎంచుకుందని.. వారికి ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా ఉందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. భారతదేశంలోని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నావికాదళం కలిసి పాకిస్థాన్‌కు మర్చిపోలేని సమాధానాన్ని ఇస్తాయని సెహ్వాగ్ పేర్కొన్నారు. అది పాక్ ఎప్పటికీ మర్చిపోదన్నారు.
సెహ్వాగ్ ట్వీట్ వైరల్
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భయాందోళనకు గురైన పాకిస్థాన్ దేశంలోని అనేక ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అయితే పొరుగు దేశం చేసే ప్రతి దాడికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. సైన్యం కూడా ప్రతీకార చర్యను ప్రారంభించింది. లాహోర్, కరాచీలపై దాడి చేసింది. ఈ పరిస్థితికి సంబంధించి వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పాకిస్థాన్ మౌనంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ఎంచుకుంది. కాల్పులు జరపడం ద్వారా ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను కాపాడటానికి పాకిస్థాన్ ప్రయత్నించింది. ఇది వారి మనస్తత్వాన్ని చూపిస్తుంది. మన సైన్యం దీనికి తగిన సమాధానం ఇస్తుంది. పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు." అని వీరేంద్ర సెహ్వాగ్ రాసుకొచ్చాడు.

ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్
పాకిస్థాన్ కాల్పులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. భారత సైన్యం లాహోర్, కరాచీలపై దాడి చేసింది. దీనితో పాటు సైన్యం పాకిస్థాన్ లోని అనేక నగరాలపై దాడి చేసింది. కరాచీలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరాచీ ఓడరేవులో భారత సైన్యం 8 నుంచి 12 పెద్ద పేలుళ్లు కూడా చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ చర్యతో పాకిస్థాన్ పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. పాకిస్థాన్ పిరికి చర్యకు తగిన సమాధానం ఇస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.