Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాడలేని జహీర్: విదేశాల్లో ఫాస్ట్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్ ఏమయ్యాడు?

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత ఆ స్ధానంలో కెప్టెన్ కోహ్లీకి ఇష్టమైన రవిశాస్త్రిని బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే.. రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించిన సమయంలోనే క్రికెట్ త్రిమూర్తులు గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ జహీర్‌ ఖాన్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా, ద్రవిడ్‌ను విదేశాల్లో బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

 ఎక్కడా కనిపించిన జహీర్ ఖాన్

ఎక్కడా కనిపించిన జహీర్ ఖాన్

అయితే అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో చివరకు వీరిద్దరూ విదేశీ పర్యటనల్లో భారత్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీమిండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా.. సవాల్‌గా తీసుకున్న దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ కన్సల్టెంట్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన జహీర్ ఖాన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా జహీర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ

బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా జహీర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ

అసలు జహీర్‌ ఖాన్ దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడో లేదో కూడా తెలియడం లేదు. దీంతో జహీర్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఉన్నాడా లేడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌ నెట్‌ ప్రాక్టీస్‌ కోసం ప్రత్యేకంగా బౌలర్లను వెంట తీసుకెళ్లదు. కానీ, తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు యువ పేసర్లు అంకిత్‌ రాజ్‌పుత్‌, అవేశ్‌ ఖాన్‌, బాసిల్‌ థంపి, మహమ్మద్‌ సిరాజ్‌లను నెట్‌ బౌలర్లుగా దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లింది.

శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌

శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో వార్మప్ మ్యాచ్‌లు లేకపోవడంతో.. శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. అయితే, ఈ కీలక పర్యటనకు విదేశాల్లో జట్టు బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్‌లుగా ఎంపికైన జహీర్‌ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌ ఎక్కడా కనిపించడం లేదు. అయితే భారత అండర్‌-19 కోచ్‌‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్‌లో జనవరి 13 నుంచి మొదలయ్యే వరల్డ్‌ కప్‌ కోసం అక్కడికి వెళ్లాడు.

తెలియదని సమాధానమిచ్చిన బీసీసీఐ

తెలియదని సమాధానమిచ్చిన బీసీసీఐ

కానీ, బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న జహీర్‌ ఖాన్ జట్టుతో కలవకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ సహాయక సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదంటున్నారు. బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యులు సైతం దీని గురించి ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బౌలింగ్‌ కోచ్‌‌గా ఉన్న భరత్‌ అరుణ్‌ పర్యవేక్షణలో భారత బౌలర్లు రాటుదేలారు. గేతడాది కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌, జస్ర్ఫీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా పేస్‌ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.

Story first published: Sunday, December 31, 2017, 12:51 [IST]
Other articles published on Dec 31, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+