Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: లిట్టన్ దాస్‍కు బ్యాట్ బహుమతిగా ఇచ్చిన విరాట్ కోహ్లీ..

Indias star player Virat Kohli gifted a bat to Bangladesh player Liton Das

బుధవారం భారత్ తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ లిట్టన్ దాస్ ఆట అందరిని ఆకట్టుకుంది. అయితే భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లిట్టన్ దాస్ కు బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ జలాల్ యూనస్ తెలిపాడు.

లిట్టన్‌కు స్ఫూర్తినిచ్చే క్షణం
"మేము డైనింగ్ హాల్‌లో కూర్చున్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిట్టన్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. నా ప్రకారం, ఇది లిట్టన్‌కు స్ఫూర్తినిచ్చే క్షణం. లిట్టన్ క్లాస్ బ్యాటర్. అతను క్లాసికల్ షాట్లు ఆడటం మేము చూశాము. అతను ఒక టెస్టులు, ODIలలో అద్భుతమైన ఆటగాడు. ఇటీవల, అతను T20I లలో కూడా బాగా ఆడటం ప్రారంభించాడు" అని యూనస్ BD క్రిక్‌టైమ్‌లో పేర్కొన్నాడు.

జింబాబ్వేతో
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్ లో విరాకట్ కోహ్లీ శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనేని అధిగమించి, T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.ఈ టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ మూడు అర్ధశతకాలు సాధించాడు. కాగా భారత్ ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళ్తుంది. గ్రూప్-2 నుంచి సెమీస్ కు వెళ్లే జట్లు ఏవో ఆదివారం తేలిపోతుంది. గ్రూప్-2 సెమీస్ కు సౌతాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. వీటిలో రెండు జట్లు సెమీస్ కు వెళ్తాయి.

Story first published: Saturday, November 5, 2022, 17:50 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+