ఆసియా కప్‌లో మరో కీలక మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అయింది. పాకిస్తాన్‌పై విజయం మత్తు దిగకముందే.. శ్రీలంకతో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు వెల్లడించాడు.
వరుసగా మూడో రోజు టెస్టు ఆడుతున్న ఫీలింగ్ ఉందని, అయితే ఇలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించి అడ్జస్ట్ అవడం చాలా కీలకమని రోహిత్ అన్నాడు. పిచ్ చూస్తుంటే పాకిస్తాన్ మ్యాచ్‌కు చాలా భిన్నంగా కనిపిస్తోందని, ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు ఎక్కువ సహకారం అందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నానని రోహిత్ వివరించాడు. ఈ క్రమంలోనే తమ జట్టులో శార్దూల్ ఠాకూర్‌ను పక్కన పెట్టి, అక్షర్ పటేల్‌ను తీసుకున్నామని ప్రకటించాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తమకు నాలుగైదు రోజుల విశ్రాంతి దొరికిందని, కాబట్టి అంత అలసిపోయినట్లు ఫీలవడం లేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే వెళ్లి పూల్ సెషన్‌లో పాల్గొన్నామని, ఆటగాళ్ల శరీరాలకు పూర్తిగా విశ్రాంతి దొరికేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పాడు. ఇక శ్రీలంక జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు ఆ టీం కెప్టెన్ దాసున్ షనక వెల్లడించాడు.
ఇక వెన్నునొప్పితో పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ కూడా ఆడటం లేదు. అతను కోలుకున్నప్పటికీ తొందర పడకూడదని అనుకున్న టీం ఫిజియోలు.. అతన్ని విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. దీంతో అతను స్టేడియానికి కూడా రాకుండా హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.