Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీ బలహీనత అదేనంటూ విమర్శలు.. పిచ్చి వాదన అంటున్న మాజీ దిగ్గజం!

పాకిస్తాన్‌పై కీలక మ్యాచులో అజేయ శతకంతో విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. ప్రేమదాస్ స్టేడయంలో అద్భుతమైన రికార్డు ఉన్న అతను.. శ్రీలంకపై కూడా చెలరేగుతాడని అంతా అనుకున్నారు. కానీ వెల్లలెగె వేసిన బంతిని నేరుగా ఫీల్డర్‌కు కొట్టి అవుటయ్యాడీ మోడ్రన్ గ్రేట్. ఇది చూసిన చాలా మంది కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్న అతిపెద్ద బలహీనత ఇదేనంటూ విమర్శలు చేశారు.

ఎడం చేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ తెగ ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో మ్యాచుకు ముందు ఈ విమర్శలు చేయడం గమనార్హం. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ కూడా ఎడం చేతి వాటం స్పిన్నర్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాపై కూడా కోహ్లీ తడబడటం ఖాయమని కొందరు జోస్యం చెప్తున్నారు.

India Srilanka Match Is this Virat Kohli weakness in batting

ఓవరాల్‌గా ఎడం చేతి వాటం స్పిన్నర్లపై కోహ్లీ రికార్డు అంతచెత్తగా ఏం లేదు. ఈ తరహా బౌలింగ్‌లో 22 సార్లు అవుటైన కోహ్లీ.. 63 సగటు, 90 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. కాబట్టి ఇదే అతని బలహీనత అని చెప్పడం సబబు కాదు. ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. 47 సెంచరీలు కూడా బాదాడు. ఈ క్రమంలో మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఈ సమస్యపై మాట్లాడాడు.

కోహ్లీలా సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్ ఉన్నప్పుడు.. ఏదో ఒక తరహా బౌలర్లకు ఎక్కువ సార్లు అవుటవడం సహజమేనని, దీన్ని బలహీనత అనడం కరెక్ట్ కాదని చావ్లా వివరించాడు. 'ఆరోజు ఎవరు బాగా ఆడారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కోహ్లీ ఆడినన్ని మ్యాచులు ఆడితే.. ఒకరు కాకపోతే మరొకరి బౌలింగ్‌లో అవుటవడం సహజమే' అని చావ్లా అన్నాడు.

'లంకపై కోహ్లీ అవుటైన తీరు సింపుల్‌గా ఉన్నా కూడా.. అది కోహ్లీ చాలా ఎక్కువగా ఆడే షాట్. పిచ్ నుంచి బంతి అతను అనుకున్నంత వేగంగా రాలేదు. అందుకే అవుటయ్యాడు. మామూలుగా అయితే స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ ఫీల్డర్ల మధ్య నుంచి ఈ బంతి వెళ్లిపోయేది. ఇక నిజంగానే కోహ్లీకి ఎడం చేతి వాటం బౌలర్లను ఎదుర్కోవడం అంత పెద్ద సమస్య అయితే.. అతను 47 సెంచరీలు చచ్చినా చేసి ఉండే వాడు కాదు' అని చావ్లా తేల్చిచెప్పాడు.

Story first published: Thursday, September 14, 2023, 8:42 [IST]
Other articles published on Sep 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+