Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో ఉండేదెవరో..ఊడేదెవరో: ఆ అదృష్టం ఎవరిదో గానీ: ఆ ముహూర్తం ఫిక్స్..!!

India squad for T20 World Cup 2022 to be selected on September 15th after ICC set a deadline

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆ దేశ జట్టుతో రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్ కోసం బరిలోకి దిగింది. టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. హరారె స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో మ్యాచ్ కొనసాగుతోంది. జూనియర్, సీనియర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు ఇందులో ఆడట్లేదు.

ఇవ్వాళ్టి నుంచే..

ఇవ్వాళ్టి నుంచే..

దీని తరువాత భారత జట్టు ఆసియా కప్‌ 2022లో ఆడబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక కప్‌లో భాగంగా ఈ నెల 28వ తేదీన పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఇవ్వాళే ఆరంభం కానున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో సింగపూర్, హాంకాంగ్ ఆడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫ్యాన్ కోడ్ క్వాలిఫయర్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆసియా కప్‌తో..

ఆసియా కప్‌తో..

దీని తరువాత ఇక భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌ కోసం టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసియా కప్ నిర్ధారిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆసియా కప్ మ్యాచ్‌లల్లో సత్తా చాటిన వారికే టీ20 ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసే జట్టులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

15 మంది ప్లేయర్లు..

15 మంది ప్లేయర్లు..

టీ20 ప్రపంచ కప్‌లో ఆడబోయే ప్లేయర్ల జాబితాను అందజేయడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్‌లైన్ విధించింది. సెప్టెంబర్ 16వ తేదీ నాటికి జట్ల వివరాలను అందజేయాలంటూ ఈ టోర్నమెంట్ ఆడనున్న దేశాల బోర్డులకు లేఖలు రాసింది. కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఒక్కో జట్టులో 15 ప్లేయర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ ఆడటానికి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లే ఒక్కో జట్టులో 30 మంది వరకు అవకాశం ఇచ్చింది.

30 మందితో..

30 మందితో..

15 మంది ప్లేయర్లు, ఎనిమిది మంది సపోర్టింగ్ స్టాఫ్‌ ఉంటారు. మరో ఏడుమందిని అదనంగా తీసుకుని రావొచ్చని సూచించింది. ఈ ఏడుమందిలో నెట్ బౌలర్లు సపోర్టింగ్ స్టాఫ్‌‌ను ఎంపిక చేయవచ్చని పేర్కొంది. కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక డాక్టర్ తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అక్టోబర్ 16వ తేదీన ఆరంభమౌతుంది. తొలి రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌లు ఉంటాయి. దీని తరువాత సూపర్ 12 మొదలవుతుంది.

సెప్టెంబర్ 15న

సెప్టెంబర్ 15న

ఈ టోర్నమెంట్‌లో ఆడబోయే జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ 15వ తేదీన ఎంపిక చేయనుంది. 16వ తేదీ నాటికి జాబితా అందజేయాల్సి ఉన్నందున.. దానికి ఒక్క రోజు ముందు టీమ్‌ను సెలెక్ట్ చేస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్‌, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ వంటి సీనియర్ల కూడిన జట్టును టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయ్యొచ్చు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, దీపక్ హుడా వంటి టీ20 స్పెషలిస్టుల మధ్య పోటీ ఉండొచ్చు.

Story first published: Saturday, August 20, 2022, 13:31 [IST]
Other articles published on Aug 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+