స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు:
గత రెండేళ్లుగా ఐపీఎల్ టోర్నీలో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఇటీవలే టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అక్కడ సత్తాచాటడంతో ఏకంగా భారత టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కింది. భారత మేనేజ్మెంట్ ఈ ఇద్దరిపై భారీ ఆశలే పెట్టుకుంది. జట్టులో చోటు ఆశించిన శిఖర్ ధావన్‌కు భారత సెలెక్టర్లు చోటివ్వలేదు. అలానే గాయం కోలుకున్న శ్రేయాస్ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, స్వింగ్ బౌలర్ దీపక్ చహర్‌లను పక్కనపెట్టడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇక ఆర్ అశ్విన్‌కు జతగా రాహుల్ చహర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలను బీసీసీఐ ఎంపికచేసింది. యూఏఈ పిచ్‌లపై వీరందరికి అనుభవం ఉంది.
మెంటర్‌గా ధోనీ:
టీ20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్‌లను బీసీసీఐ ఎంపికచేసింది. భారత జట్టుకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2021 అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సారథి పొట్టి కప్ కోసం యూఏఈలోనే ఉండనున్నాడు. ఈ నెల 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 20201లోని మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ గతేడాది అక్టోబర్ 15-నవంబర్ 15 మధ్య భారత్‌లో జరుగాల్సి ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తాత్కాలికంగా టోర్నీని ఐసీసీ వాయిదా వేసింది. మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈకి మార్చారు.

అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మ్యాచ్:
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో మెగా టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

పాకిస్తాన్, న్యూజీలాండ్‌ను ఓడిస్తే:
టీ20 ప్రపంచకప్‌లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. ఇక పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ (స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్).


Click it and Unblock the Notifications












